/rtv/media/media_files/2026/01/31/sharad-pawar-responds-on-ncp-merger-buzz-2026-01-31-14-39-07.jpg)
Sharad Pawar responds on NCP merger buzz
అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన ఆ పార్టీ మళ్లీ ఒక్కటవుతుందా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ అంశంపై స్పందించారు. ఎన్సీపీ విలీనానికి అజిత్ పవార్ అనుకూలంగానే ఉండేవారని అన్నారు. విలీనంపై చర్చలు కూడా జరిగినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న రెండు వర్గాలు కలిసిపోవాలని అజిత్ కోరుకున్నట్లు తెలిపారు. కానీ దురద-ృష్టవశాత్తు విమాన ప్రమాదం ఘటన వల్ల ఈ చర్చలు ఆగిపోయినట్లు చెప్పారు.
Also Read: ఫోన్లోనే ఆధార్‌లో మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్.. అదిరిపోయే కొత్త యాప్ ఇదే!
మరోవైపు అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కానీ దీనిపై తనకు ఎలాంటి సమాచారం తెలియదని శరద్ పవార్ అన్నారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరె ఆ పార్టీలో సీనియర్ నాయకులను.. వాళ్లే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
Also Read: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు పవార్ కొడుకు!
అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ పదవిని స్వీకరించిన మొదటి మహిళగా ఆమె నిలుస్తారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలే పాల్గొనే ఛాన్స్ లేదని సమాచారం.
Follow Us