vasundhara yadav : అందాల ఓ పూరెమ్మ...ఖాకీచొక్క వేసుకున్న కుందనపు బొమ్మ.. డ్యాన్స్‌తో అదరగొట్టిన లేడీ ఐపీఎస్

ఇటీవల జరిగిన కుంభమేళాలో పూసలమ్మే మోనాలిసా కళ్లను చూసి దేశమంతా ఫిదా అయింది. ఆమెను సోషల్‌మీడియాలో రాత్రికిరాత్రే పెద్ద సెలబ్రిటీని చేసేశారు. తాజాగా మేడారంలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తన డ్యాన్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.

New Update
FotoJet (91)

Vasundhara Yadav

vasundhara yadav : ఇటీవల జరిగిన కుంభమేళాలో పూసలమ్మే మోనాలిసా కళ్లను చూసి దేశమంతా ఫిదా అయింది. కుంభమేళా మొనాలిసా అంటూ.. ఆమెను సోషల్‌మీడియాలో రాత్రికిరాత్రే పెద్ద సెలబ్రిటీని చేసేశారు. తాజాగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సారలమ్మ గద్దెపైకి వచ్చే సమయంలో మంత్రి సీతక్కతోఎ పాటు పలువురు పోలీస్‌ అధికారులు గిరిజనుల దరవుకు తగినట్లు స్టెప్పులు వేశారు. అందులో వసుంధర యాదవ్‌ కూడా వారితో కలిసి వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


 
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత వైభవంగా సాగుతోంది. ఈ భక్తి పారవశ్యం మధ్య మోనాలిసాలాగే అందాల మెరుపుతీగలా వసుంధర కూడా ఓ మెరుపు మెరిసింది. ఆమె డ్యాన్స్‌తో పాటు అందానికి అందరూ మంత్రముగ్ధలవుతున్నారు. ఆమె డ్యాన్స్‌తో పాటు ఆమెను మళ్లీ మళ్లీ చూసేందుకు ఆమె వీడియోలు, ఫోటోల కోసం నెట్టింట తెగ వెతుకుతున్నారు. ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మేడారం జాతరలో అందమైన ఐపీఎస్ ఆఫీసర్  అంటూ కొందరు, మేడారంలో మరో మోనాలిసా అంటూ మరి కొందరూ  వీడియోలను షేర్ చేస్తున్నారు.  దీంతో సదరు వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఎవరా ఆఫీసర్ అంటూ నెటిజన్లు నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఎంత బాగా చేసింది. అసలు ఈ అమ్మాయి. అంత అందం పెట్టుకుని ఎలా ఐపీఎస్ అధికారి ఎలా అయ్యారు.. సినిమాలపైపు వెళ్లాల్సింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అసలు ఎవరీ వసుంధర?

సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తున్న సందర్భంలో.. రాష్ట్ర మంత్రి సీతక్క, తోటి పోలీసు అధికారులతో ఉత్సాహంగా అడుగులు వేసిన ఆ ఐపీఎస్‌ అధికారిణి పేరు వసుంధర యాదవ్. ఖాకీ దుస్తుల్లో గంభీరంగా ఉంటూనే.. జాతర సంబరాల్లో మమేకమై ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు ప్రతి వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ‘మేడారంలో మెరిసిన కుందనపు బొమ్మ’ అంటూ ఈ వీడియోలు షేర్ కావడంతో, నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి నెట్టింట తెగ వెతుకుతున్నారు.

తండ్రి కల నెరవేర్చడానికి..

వసుంధర యాదవ్ కేవలం తన డ్యాన్స్‌తోనే కాదు.. ఆమె జీవిత పోరాటంతోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన ఆమె.. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఫరూబీ యాదవ్ కు తన బిడ్డను ఐపీఎస్‌ చేయాలన్న కోరిక ఉంది. ఆ కల నెరవేర్చడం కోసం వసుంధర  ఐపీఎస్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదుసార్లు విఫలమైనా పట్టు వదలకుండా.. ఆరో ప్రయత్నంలో తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా నిలిచారు. ‘నాన్న కోరిక నెరవేర్చడమే నాకు అత్యంత సంతోషకరమైన విషయం’ అని ఆమె గర్వంగా చెబుతారు. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.  

 
యూపీ టు తెలంగాణ
2023 బ్యాచ్‌కు చెందిన వసుంధర యాదవ్. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కాగా అక్కడి నుంచి 2024లో తెలంగాణకు బదిలీపై వచ్చారు. వసుంధర యాదవ్ 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అజయ్ యాదవ్‌తో వివాహం జరిగింది. వీరి వివాహం ఫిబ్రవరి 2025న లక్నోలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఇద్దరూ ఉన్నతాధికారులు కావడంతో వీరి వివాహం చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం అజయ్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని కల్లూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త ఇక్కడే పనిచేస్తుండటంతో.. ఆమె కూడా ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ క్యాడర్‌కు బదిలీపై వచ్చారు. గతంలో గ్రేహౌండ్స్‌లో ఏఎస్పీగా అనుభవం గడించిన వసుంధర, ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మేడారం జాతరలో భద్రతా పర్యవేక్షణ కోసం వచ్చిన ఆమె.. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు.

విధుల కంటే డాన్స్‌తో హైలెట్‌
అయితే వసుంధర యాదవ్‌ విధుల నిర్వహణలో కంటే డ్యాన్స్ తో హైప్ తెచ్చుకున్నారు. మేడారం జాతరలో భద్రత పర్యవేక్షణకు వచ్చిన వసుంధర యాదవ్ నిర్వర్తించిన విధుల కంటే, ఆమె డాన్స్ ను హైలెట్ చేసిన సోషల్ మీడియా ఆమెను మేడారం మోనాలిసా అంటూ  అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు. కుంభమేళాలలో పూసల అమ్ముకున్న మోనాలిసా కు, ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ కు లింకు పెట్టి సోషల్ మీడియాలో తెగ పబ్లిసిటీ చేస్తున్నారు.    ప్రస్తుతం ఆమె మేడారం జాతరలో విధుల్లో ఉన్నారు. అక్కడ అన్ని పర్యవేక్షిస్తుంటూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు