New Update
/rtv/media/media_files/2026/01/31/us-offers-venezuelan-oil-to-india-as-russian-crude-imports-fall-2026-01-31-16-52-52.jpg)
US offers Venezuelan oil to India as Russian crude imports fall
గతేడాది రష్యా, వెనెజువెలా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసుకుంటున్నందుకు అమెరికా భారత్‌పై 50 శాతానికి టారిఫ్‌లు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకుంటామని చెప్పింది. దీంతో రాబోయే రోజుల్లో భారత్.. రష్యా నుంచి చమురు దిగుమతులను కొన్ని లక్షల బ్యారెళ్ల మేర తగ్గించుకుంటుందని పలు వర్గాలు వెల్లడించాయి.
గతేడాది మార్చిలో ట్రంప్.. వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌తో సహా పలు దేశాలపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా ట్రంప్ యంత్రాంగం ప్రచారం కూడా చేసింది. చివరికి ఈ ఏడాది జనవరి 3న ఆయన్ని అమెరికా సైన్యం బంధించి తమ దేశానికి తీసుకెళ్లింది. అప్పటినుంచి వెనెజువెలా ప్రభుత్వానికి అమెరికానే ఆదేశాలు జారీ చేస్తోంది. అలాగే ఆ దేశ చమురు పరిశ్రమను కూడా అమెరికానే నియంత్రించేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు రష్యాను ఆర్థికంగా దెబ్బతియాలని అమెరికా భావిస్తోంది. చమురుని అమ్ముకుంటూ ఆదాయం పొందుతున్న రష్యాకు ఉక్రెయిన్‌తో యుద్ధం చేసేందుకు ఆర్థికంగా సాయం అందుతోంది. ఈ క్రమంలోనే ఆ ఆదాయాన్ని దెబ్బతీయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భారత్‌కు రష్యా చమురు స్థానంలో వెనెజువెలా నుంచి చమురును దిగుమతి చేయించేలా ప్లాన్ చేస్తోంది.
2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా తన చమురు ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. తక్కువ ధరకు లభిస్తుండటంతో రష్యా నుంచి చమురును ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. గతవారం భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సైతం కీలక వ్యాఖ్యలు చేశార. ప్రస్తుతం రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గిపోతుండటంతో ఇతర దేశాల వైపు కూడా చూస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే రష్యా నుంచి భారత్ ఒకరోజుకి 10 లక్షల బ్యారెళ్ల చమురుకి తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో రోజుకి 12 లక్షల బ్యారెళ్లను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరిలో 10 లక్షలు, మార్చిలో 8 లక్షల బ్యారెళ్లకు రష్యా నుంచి చమురును తగ్గించుకుంటుందని రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. ఇక భవిష్యత్తులో దీన్ని ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షల బారెళ్లకు మాత్ర పరిమితం చేసి, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న చమురు లోటును పూడ్చుకునేందుకు భారత్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి కొనుగోళ్లు పెంచింది.
తాజా కథనాలు
Follow Us