/rtv/media/media_files/2026/01/31/fotojet-92-2026-01-31-15-41-39.jpg)
Telangana rolls out vehicle registration facility in showrooms
TG News: వాహనాల అతివేగం, రాంగ్‌రూట్, హెల్మెట్ లేకుండా ప్రయాణం తదితర నిబంధనల ఉల్లంఘనలకు విధించే జరిమానాలను నేరుగా బ్యాంకు ఖాతా నుంచి కట్ అయ్యే విధానం ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ అన్న మాటలను అధికారులు నిజం చేసక్తున్నారు. తాజాగా నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు షోరూమ్‌ల వద్దే చేస్తూ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిన అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త నిబంధనను తెరమీదకు తెచ్చారు. అదే వాహనాల రిజిస్ట్రేషన్ సందర్భంగా యజమాని బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వివరాలను కూడా తీసుకుంటుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ వివరాలను నమోదు చేయకపోతే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు అప్‌లోడ్ కావడం లేదు.
దీంతో రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాల జాబితాలో బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఉండాలంటూ షోరూముల నిర్వాహకులు బోర్డులు పెడుతున్నారు. ఇది చలానాల ఆటోడెబిట్ కోసమేనని చర్చ సాగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇలా చేయడం ద్వారా ట్రాఫిక్ జరిమానాలను ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి వసూలు (ఆటో డెబిట్) చేసుకోవడానికే బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారనే ప్రచారం మొదలైంది. వాహనాల అతివేగం, రాంగ్‌రూట్, హెల్మెట్ లేకుండా ప్రయాణం తదితర నిబంధనల ఉల్లంఘనలకు విధించే జరిమానాలను నేరుగా బ్యాంకు ఖాతా నుంచి కట్ చేసుకునే విధానం ఉండాలని ఇటీవల ఒక సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. బ్యాంకు ఖాతా వివరాల సేకరణ అంశం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే దీనిపై స్పందించిన అధికారులు రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఖాతా వివరాలు కేవలం చిరునామా ప్రూఫ్ కోసమేనని చెబుతున్నాయి. రవాణాశాఖ వద్ద, ఆర్సీ కార్డులపై యజమానుల పాత చిరునామాలే ఉంటున్నాయని.. వారు ఇండ్లు మారినప్పుడు కొత్త చిరునామాను నమోదు చేసుకోవడం లేదని పేర్కొంటున్నారు. దీనివల్ల ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర అవసరమైన సందర్భాల్లో వాహనాల యజమానులను గుర్తించడం, సంప్రదించడంలో సమస్యలు వస్తున్నాయని.. అందుకే బ్యాంకు ఖాతా వివరాల సేకరిస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు.
Follow Us