/rtv/media/media_files/2026/01/31/fotojet-93-2026-01-31-15-58-04.jpg)
CPI and BRS alliance in Kyatanapalli Municipality
Kyatanapalli Municipality: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీపీఐ నాయకుల మధ్య సయోధ్య కుదిరింది. ఈ మేరకు రామకృష్ణాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సుమన్‌తో సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ , ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య లు పొత్తు విషయాన్ని వెల్లడించారు. ఈ నెల మూడవ తేదీన పార్టీల వారీగా సీట్ల ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఇరు పార్టీలు కలిసి సమన్వయతో పనిచేసి క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ప్రకటించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో కలిసి పోటీ చేయనున్న సిపిఐ, బీఆర్ఎస్.
— Balka Suman (@balkasumantrs) January 31, 2026
ఈ నెల మూడవ తేదీన పార్టీల వారీగా సీట్ల ఖరారు.
రామకృష్ణాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు,… pic.twitter.com/zdopVlvkgs
కాగా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలతో సింగరేణి ఉనికే ప్రమాదంలో పడుతుందన్న సీపీఐ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. పదుల సంఖ్యలో స్కాముల ద్వారా సింగరేణిని బొంద పెడుతున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ కార్మికేతర విధానాలను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ సీపీఐ కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఇరుపార్టీల నాయకులు వెల్లడించారు.
Follow Us