US Government : అమెరికాలో మరోసారి షట్‌డౌన్‌

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ప్రతిష్టంభన చివరికి పాక్షిక ప్రభుత్వ మూసివేతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి కల్లా బడ్జెట్‌ను ఆమోదించడంలో కాంగ్రెస్ ఫెయిల్ కావడంతో ఫెడరల్ నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి.

New Update
closed

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్(America Shut Down) అయింది. 2026 బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ప్రతిష్టంభన చివరికి పాక్షిక ప్రభుత్వ మూసివేతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి కల్లా బడ్జెట్‌ను ఆమోదించడంలో కాంగ్రెస్ ఫెయిల్ కావడంతో ఫెడరల్ నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి.

Also Read :  ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్.. బిల్ గేట్స్‌కు శృంగార రోగాలు!

ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు

నిజానికి బడ్జెట్ చర్చలు సజావుగానే సాగుతున్న తరుణంలో, మిన్నియాపాలిస్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు మరణించడం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై డెమొక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిధుల కేటాయింపులపై చర్చలను అడ్డుకున్నారు. దీనివల్ల బడ్జెట్ గడువు ముగిసి, షట్‌డౌన్ అనివార్యమైంది.

ఈ షట్‌డౌన్ పాక్షికమే. ఎందుకంటే వ్యవసాయం, జస్టిస్, నేషనల్ పార్క్స్ , వెటరన్స్ సర్వీసెస్ వంటి శాఖలకు ఇప్పటికే పూర్తి స్థాయి నిధులు ఉన్నాయి. కాబట్టి వీటిపై పెద్దగా ప్రభావం ఉండదు.ట్రెజరీ, డిఫెన్స్, రవాణా, ఆరోగ్య శాఖలు మాత్రం షట్‌డౌన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అత్యవసరం కాని పనులను తాత్కాలికంగా నిలిపివేస్తారు.

ఈ అంతరాయం ఎంతో కాలం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సెనేట్ ఆమోదించిన ఒప్పందాన్ని వచ్చే వారం ప్రారంభంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించే అవకాశం ఉందని, తద్వారా సోమవారం కల్లా మళ్లీ కార్యకలాపాలు పునఃప్రారంభం కావచ్చని అంచనా. గత ఏడాదిలో ఇది రెండో షట్‌డౌన్ కావడం గమనార్హం. గతంలో జరిగిన 43 రోజుల షట్‌డౌన్ అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా రికార్డు సృష్టించింది.

అమెరికాలో షట్‌డౌన్‌ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 1981 నుంచి యూఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 16 సార్లు మూతపడింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడగా.. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. - us government news

Also Read :  అతని భార్యపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ కామెంట్స్ వైరల్

Advertisment
తాజా కథనాలు