సీఎం చంద్రబాబు నివాసంలో దీపావళి వేడుకలు!-PHOTOS
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై విచారణ చేసిన ఇంటెలిజెన్స్ పోలీసులు నిజమేనని తేల్చినట్లు ప్రచారం సాగుతోంది.
బీహార్ ఎన్నికల వేళ తాజా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహాఘట్బంధన్ కూటమిలో భాగమైన జేఎంఎం పోటీ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది.
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎన్డీయే కూటమి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే విపక్ష కూటమి అయిన మహాఘఠ్‌బంధన్‌లో మాత్రం సీట్ల సర్దుబాటుపై విభేదాలు నెలకొన్నాయి.
ముషీరాబాద్‌లో సదర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి రూ. 31 వేల విలువజేసే రాయల్ సెల్యూట్ విస్కీ ఫుల్ బాటిల్ తాగించడం సంచలనంగా మారింది. ఈ విస్కీ 21 ఇయర్స్ ఓల్డ్దిగా చెబుతున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. అస్రాని తన 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా సినిమామాల్లో నటించారు.
తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిన్నమొన్నటివరకు ముఖ్యమంత్రితో విభేదిస్తూ వచ్చిన కొండా సురేఖ దంపతులు సోమవారం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ సమక్షంలో వారి భేటీ జరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చడం తప్ప ఒక్క కొత్త నిర్మాణం చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీపావళి సందర్భంగా సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో దీపావళి పండుగను జరుపుకున్నారు కేటీఆర్.