/rtv/media/media_files/2025/10/20/pm-modi-celebrates-diwali-aboard-ins-vikrant-2025-10-20-19-44-37.jpg)
PM Modi Celebrates Diwali Aboard INS Vikrant
INS Vikranth: ప్రతీ సంవత్సరం ప్రధాని మోదీ దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులతో కలిసి దీపావళి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రికే స్వదేశీ విమాన వాహన నౌక INS విక్రాంత్‌కు వెళ్లారు. సోమవారం ఉదయం నేవీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్థాన్‌పై కూడా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. INS విక్రాంత్ పాక్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చినట్లు గుర్తుచేశారు.
Also Read: ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్ హత్యకు మరో కుట్ర.. చెట్టుపై నుంచి స్కోప్!
INS విక్రాంత్ ప్రత్యేకత
INS విక్రాంత్ అనేది విమాన వాహక నౌక. ఇది ఓడలా మాత్రమే కాకుండా సముద్రంలో తేలియడే సైనిక స్థావరంలా పనిచేస్తుంది. దీనిపై రన్‌వే కూడా ఉంటుంది. యుద్ధ విమానాలు దీనిపై ల్యాండింగ్, టేకాఫ్ అవుతాయి. ఈ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ప్రయాణించడానికి ఉపయోగించేది చోదక వ్యవస్థ. ఇందులో నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ గ్యాస్ టర్బై్న్లు ఉంటాయి. 80 మెగావాట్ల కంటే ఎక్కువ శక్తిని ఇవి విడుదల చేయగలవు. ఈ టర్బైన్ల శక్తి ద్వారానే రెండు ప్రొపెల్లర్ షాఫ్టులు తిరుగుతాయి. ఈ వ్యవస్థ సాయంతో నౌక.. గంటకు సుమారు 52 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకసారి ఇంధనం నింపుకున్నాక ఏకంగా 7500 మైళ్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.
Also Read: నిరసనకారులపై బురద చల్లిన ట్రంప్.. AIతో అమెరికా అధ్యక్షుడి వింత శేష్టలు
నౌక కార్యక్రలాపాలు
INS విక్రాంత్ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను మోహరించడం, అలాగే వాటిని ఆపరేట్ చేయడం లాంటివి చేస్తుంది. దీనిపై యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యేందుకు రన్‌వే చివర కొద్దిగా పైకి వంగి స్కీజంప్ ర్యాంప్ ఉంటుంది. దీని నుంచి విమానం వేగంగా పైకి దూసుకెళ్లేందుకు ర్యాంప్ అదనపు శక్తిని ఇస్తుంది. దీనివల్ల యుద్ధ విమానాలకు తక్కువ దూరంలోనే గాల్లోకి ఎగరగలిగే సామార్థ్యం ఉంటుంది. విమానం తిరిగి నౌకపై ల్యాండ్ అయ్యేటప్పుడు అరెస్టర్ వైర్‌లు ఉంటాయి. విమానం కిందకి దిగేటప్పుడు దాని వెనుక భాగంలో ఉండే టెయిల్‌హుక్ ఆ వైర్లను పట్టుకుంటుంది. దీంతో అది తక్కువగ దూరంలోనే సేఫ్‌గా ల్యాండ్ అవుతుంది. ఈ నౌకపై యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను నిలిపి, మరమ్మతులు చేసి యుద్ధానికి సిద్ధం చేయొచ్చు.
యుద్ధ సామర్థ్యాలు
విక్రాంత్ కేవలం యుద్ధ విమానాలకు స్థావరంగా మాత్రమే కాకుండా.. దాని చుట్టూ ఉండే యుద్ధనౌకల సమూహానికి కూడా కేంద్రంగా పనిచేస్తుంది. ఇది సముద్రంలో ఎక్కడైనా కూడా ఓ బలమైన వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల్లో వైమానిక శక్తిని ప్రయోగించేందుకు వీలు కల్పిస్తుంది. శత్రు దేశాల నౌకాదళం, సబ్‌మెరైన్‌లు, అలాగే తీర ప్రాంతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయగలదు. అంతేకాదు విక్రాంత్‌లో ఉండే అధునాత సెన్సార్లు, రాడార్లు, క్షిపణి వ్యవస్థలు శత్రువుల నుంచి వచ్చే ముప్పును గుర్తించి తిప్పికొట్టేందుకు సాయపడతాయి. ఇందులో దాదాపు 1600 మంది సిబ్బంది వరకు ఉంటారు.