RGVకి హైకోర్టులో బిగ్ షాక్.. అరెస్ట్ తప్పదా?
సంచలన వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యాంగ విరుద్దంగా తన పై కేసులు పెట్టారని ఆర్జీవి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
సంచలన వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యాంగ విరుద్దంగా తన పై కేసులు పెట్టారని ఆర్జీవి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
లంచాల కోసమే జగన్ అదానీతో ఒప్పందాలకు సంతకాలు పెట్టాడని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలన్నారు. ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు.
త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. రేవంత్ కాంగ్రెస్ లైన్లోనే పని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే సంచలన నిజాలు బయటకు వస్తాయన్నారు.
తెలంగాణ బీజేపీ నేతలతో పీఎం మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ పాలన ఎలా ఉంది? కేంద్ర పథకాలు ఎలా అమలు అవుతున్నాయి?.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పని చేయాలని.. రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని దిశానిర్దేశం చేశారు.
మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కొత్త బీజేపీ చీఫ్ పై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ గా పవర్ ను పంపనుట్లు తెలుస్తోంది.