నెక్ట్స్ సీఎం కవిత.. కేటీఆర్ కాదు.. వైరల్ అవుతున్న రేవంత్ కామెంట్స్!

జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

New Update
Revanth Reddy Kavitha KTR

కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ సైతం తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కేటీఆర్ ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా.. అంటూ ఎదురు చూస్తున్నారన్నారు. జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారన్నారు. అయితే.. ఈ లెక్కన మొదట జైలుకు పోయింది కేటీఆర్ చెల్లి కవిత అని అన్నారు. అలా కూడా కేటీఆర్ కు కూడా ఆ అవకాశం లేదన్నారు. ఆ ఛాన్స్ కూడా కవిత కొట్టేసిందని సెటైర్లు వేశారు. పదేళ్లు మంత్రి పదవి చేసిన వ్యక్తి ఇలాంటి చిల్లర చేష్టలు మానాలన్నారు. 
ఇది కూడా చదవండి: BJP: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం!

దేశ రాజకీయాల్లో జైలు సెంటిమెంట్..

భారత రాజకీయాల్లో జైలు సెంటిమెంట్ పై చాలా రోజులగా చర్చ ఉంది. ఇటీవల ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఈ ప్రచారం మరింత బలపడింది. రేవంత్ రెడ్డి కూడా సీఎం కాకముందు వివిధ కేసుల విషయంలో జైలుకు వెళ్లారు. జగన్ కూడా సీఎం కాకముందు జైలుకు వెళ్లారు. అయితే.. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత వచ్చిన 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించి సీఎం అయ్యారు.
ఇది కూడా చదవండి: AP Govt: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ఇప్పుడు హేమంత్ సోరేన్..

తాజాగా జైలుకు వెళ్లి వచ్చిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కానున్నారు. దీంతో జైలు సెంటిమెంట్ పై సోషల్ మీడియాతో పాటు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మరోసారి జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ చేసిన సెటైరికల్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు