అసలుసిసలైన శివసేన ఎవరిదో తేలిపోయింది.. ఉద్ధవ్ రాజకీయ జీవితంలో మాయని మచ్చ! శివసేన మీద హక్కు ఏకనాథ్ షిండేదేనని మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. లడ్కీ బహిన్ యోజన లాంటి స్కీములే ఆయన్ను గెలిపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఉద్ధవ్ పార్టీని సరిగ్గా నడపలేకపోయారని అంటున్నారు. By Vijaya Nimma 25 Nov 2024 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Maharasthra Election: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్నో రాజకీయ ఆవిష్కరణలకు వేదికగా నిలిచాయి. ముఖ్యంగా శివసేన మీద హక్కు ఎవరిది అనే ప్రశ్నకు మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దుమ్మురేపింది. అటు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మాత్రం పూర్తిగా చతికిలపడింది. నిజానికి గతంలో షిండేను ట్రయిటర్‌గా పిలిచింది ఉద్ధవ్ వర్గం. ఆయన్ను పార్టీ ద్రోహీగా అభివర్ణించింది. అయనే ప్రజలు మాత్రం షిండే వైపే నిలబడ్డారు. దీనికి కొన్ని కారణాలను వివరిస్తున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు లడ్కీ బహిన్ యోజన లాంటి పథకాలను ప్రవేశపెట్టారు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా 2 కోట్లకు మందికిపైగా మహిళలకు ప్రతినెల రూ. 1,500 నగదు అందింది. ఇక కొన్ని కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. వృద్ధుల కోసం ఉచిత పుణ్యక్షేత్ర యాత్రలను ప్రారంభించారు. సామాజికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత విద్యను అందించే పథకాలను తీసుకొచ్చారు. ఇలాంటి సంక్షేమ పథకాలతో, షిండే తనను ప్రజల నాయకుడుగా, అసలైన శివసేన పార్టీకి లీడర్‌గా పేరును నిలబెట్టుకున్నారు. సిద్ధాంతాలకు విరుద్ధంగా షిండే ప్రచారం: అయితే శివసేనను రెండుగా చీల్చింది కూడా షిండేనే! ఆయన రెబల్‌గా మారి ఉద్ధవ్ ఠాక్రేపై 2022 జూన్‌లో తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. నాడు ఏక్‌నాథ్ షిండేకు ఏకంగా 39 మంది శివసేన ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. అంతకముందు మహారాష్ట్రకు సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఇక ఈ ఘటనల తర్వాత శివసేన రెండు ముక్కలైంది. పార్టీల సింబల్ విషయంలోనూ తన్నుకుంది. ఆ తర్వాత పార్టీ సింబల్ కూడా షిండే వర్గానికే దక్కింది. ఇలా శివసేన రెండు వర్గాలగా విడిపోయి 2024 మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో దూకాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-UBT.. కాంగ్రెస్‌తో పాటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మద్దతు ఇచ్చి ఎన్నికల పోటిలో నిలిచింది. అయితే కాంగ్రెస్, NCPతో జట్టు కట్టడం శివసేన కోర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని షిండే బాగా ప్రచారం చేశారు. 1966లో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన హిందుత్వ ఐడియాలజీను బలంగా నమ్ముతుంది. అయితే ఉద్ధవ్ మాత్రం సెక్యూలర్ పార్టీగా ముద్రపడ్డ NCP, కాంగ్రెస్‌తో పోత్తు పెట్టుకోవడాన్ని షిండే వర్గం తప్పుబట్టింది. ఇలా ఉద్ధవ్, షిండే ఇద్దరూ కూడా బాల్ ఠాక్రేని సెంట్రిక్‌గా చేస్తూ ప్రచారం చేశారు. అయితే ప్రజలు మాత్రం రియల్ శివసేనగా షిండే వర్గాన్నే నమ్మినట్టుగా ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ ఎన్నికల ఫలితాలు మరో కీలక అంశానికి వేదికగా నిలిచాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ వర్గానికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పవార్ వర్గం తక్కువ స్థానాలతోనే సరిపెట్టుకుంది. అటు NCPలో మరో వర్గమైన అజిత్‌పవార్ టీమ్ సత్తా చాటింది. రాజకీయాల్లో ఇక యాక్టివ్ గా ఉండబోనన్న సంకేతాలను ఈ మధ్యే ఇచ్చారు శరద్ పవార్ . ఈ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే..పవార్ ను ఇక ఇంట్లోనే కూర్చోమని మహారాష్ట్ర ప్రజలు సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: యోగా, రన్నింగ్, వ్యాయమంలో ఏది బెటర్? #uddhav-thackeray #maharashtra-elections #eknadh-shhindey #shiva-sena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి