BJP: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం! మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ గా పవర్ ను పంపనుట్లు తెలుస్తోంది. By Nikhil 26 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి పవన్ కల్యాణ్.. ఏపీ ఎన్నికల నాటి నుంచి ఈ పేరు మన దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడంతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఈ ఫలితాల తర్వాత బీజేపీకి ఆయన మరింత దగ్గర అవుతున్నారు. కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ను అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ కు మహారాష్ట్ర బాధ్యతలను అప్పగించింది బీజేపీ. అక్కడ ఆయన ప్రచారం చేసిన ప్రతీ చోట అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు.ఇది కూడా చదవండి: BIG BREAKING: ఏక్‌నాథ్ షిండే సంచలనం.. సీఎం పోస్ట్ నుంచి ఔట్! ఎల్లలు దాటిన ప్రజాకర్షణ కలిగి ఉండటమే కాక జనహితం కాంక్షించే జనసేనాని భావజాలానికి దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతుకు నిదర్శనమే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రచారం చేసిన దాదాపు అన్ని చోట్లా ఎన్డీఏ కూటమికి దక్కిన ప్రజామోదం.… pic.twitter.com/hDdAXLtFmy — JanaSena Party (@JanaSenaParty) November 24, 2024 దీంతో బీజేపీ హైకమాండ్ వద్ద పవన్ పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీ, బీహార్ లోనూ పవన్ ను ప్రయోగించాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఆయనను ప్రచారానికి దించాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న సినీ గ్లామర్, ఓటర్లను ఆకట్టుకునే, ప్రతిపక్షాలను తూర్పార పట్టే వాగ్ధాటి తమకు కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నట్లు ఎన్డీఏ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి: Pensions: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి శ్రీ @gssjodhpur గారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధి కేంద్ర సహకారాన్ని కోరారు. pic.twitter.com/61V4ZUjerR — JanaSena Party (@JanaSenaParty) November 26, 2024 Also Read : లేడీస్ హాస్టల్‌లో నగ్న పూజలు ! ఢిల్లీ టూర్లో జనసేనాని.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ పెద్దలను ఆయనను ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌తో పాలు పలువురు మినిస్టర్లతో పవన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్రజలశక్తి మంత్రితో ఆయన భేటీ అవుతారు. మ.3:15 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. అనంతరం.. సా.4:30 గంటలకు రైల్వేశాఖమంత్రి అశ్వినివైష్ణవ్‌తో భేటీ అవుతారు. సాయంత్రం 5:15 గంటలకు లలన్ సింగ్‌తో పవన్‌కల్యాణ్ సమావేశం షెడ్యూల్ అయ్యింది. రేపు పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు.. రానున్న రోజుల్లో పవన్ కు అప్పగించే బాధ్యతలపై మోదీ వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read : ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త! #amit-shah #delhi #bihar #narendra-modi #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి