Modi: నేడే తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్.. వారిలో ఒకరికి ఛాన్స్! మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కొత్త బీజేపీ చీఫ్ పై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 26 Nov 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి మహారాష్ట్రలో బీజేపీ భారీ విజయంతో ఆ పార్టీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పీఎం మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. నేడు పార్లమెంట్ రూమ్ నంబర్ 54లో వీరి భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఢిల్లీకి బీజేపీ ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. ఇది కూడా చదవండి: భారీ షాక్.. ఇప్పట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు లేనట్టే! దూకుడు ఎందుకు తగ్గింది? గత పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పోటీ పడి 8 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయినా.. రాష్ట్రంలో పార్టీ దూకుడు మీద లేదన్న విమర్శలు చాలా రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతలతో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మోదీ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో మోజార్టీ సీట్లు సాధించేలా రోడ్ మ్యాప్ ను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కీలక భేటీకి బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మాత్రం హాజరుకావడం లేదు. కూతురు పెళ్లి సంగీత్ నేపథ్యంలో ఆయన బహ్రెయిన్ వెళ్లారు. ఇది కూడా చదవండి: భారీ షాక్.. ఇప్పట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు లేనట్టే! కొత్త చీఫ్ పై క్లారిటీ? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో ఆయన స్టేట్ పాలిటిక్స్ పై అంతగా ఫోకస్ పెట్టడం లేదు. అయితే.. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం కారణంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వాయిద పడుతూ వస్తుందన్న చర్చ సాగుతోంది. ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. నేడుప్రధానితో భేటీ తర్వాత అధ్యక్ష ఎన్నికపై సైతం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. #modi #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి