రేవంత్ పాలన ఎలా ఉంది?: మోదీ ప్రశ్నలకు బీజేపీ నేతలు షాక్!

తెలంగాణ బీజేపీ నేతలతో పీఎం మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ పాలన ఎలా ఉంది? కేంద్ర పథకాలు ఎలా అమలు అవుతున్నాయి?.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పని చేయాలని.. రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని దిశానిర్దేశం చేశారు.

New Update
Modi Revanth

ప్రధాని మోదీని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు కలిశారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై మోదీ వారిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో ఎలా అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రేవంత్ ప్రభుత్వ పాలనపై తీరుపైనా చర్చ జరిగినట్లు సమాచారం. నేతలంతా కలిసి పని చేయాలని మోదీ దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: వివాదాస్పద ఇథనాల్‌ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం?

కొత్త చీఫ్ పై రాని క్లారిటీ..

ఈ రోజు పార్లమెంట్ లో ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం భేటీ అయ్యింది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు నేరుగా ప్రధాని తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయినట్లు చర్చ సాగుతోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, అందరూ కలిసి పని చేయాలని దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ భేటీ తర్వాత రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై క్లారిటీ వస్తుందన్న ప్రచారం సాగింది. అయితే.. ఆ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

ప్రధానికి కలిసిన వారిలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్, మాధవనేని రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి, గోడం నగేష్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రాజా సింగ్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, రామారావు పాటిల్, దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు. తన కుమార్తె వివాహం నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఈ భేటీకి హాజరు కాలేదు. 

Also Read: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల.

Also Read: వివాదాస్పద ఇథనాల్‌ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం?

Advertisment
Advertisment
తాజా కథనాలు