RGVకి హైకోర్టులో బిగ్ షాక్.. అరెస్ట్ తప్పదా?

సంచలన వివాదాల డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యాంగ విరుద్దంగా తన పై కేసులు పెట్టారని ఆర్జీవి పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

New Update
RGV

RGV: సంచలన వివాదాల డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ పిటిషన్‌  విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యాంగ విరుద్దంగా తన పై కేసులు పెట్టారని ఆర్జీవి పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ లో ఆర్జీవి తన పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు  చేయకుండా ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు. 

Also Read: Nagarjuna: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

 తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు.

 ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Also Read: Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడని.. అలాగే ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ టైంలో వారిపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. టీడీపీ నేత రామలింగం మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో RGV పై PS 7 సెక్షన్ ల క్రింద కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇటీవల విచారణకు రావాలని RGV కి నోటీసులు కూడా అందించారు.

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

తొలుత ఈ కేసులో కీలక అంశాలపై విచారించేందుకు విచారణకు నవంబర్ 11న రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు నోటిసులు ఇచ్చారు. ఈ క్రమంలో అర్జీవి విచారణకు డుమ్మా కొట్టారు. ముందస్తు షెడ్యుల్ కారణంగా రాలేనని CI కి వాట్సాప్ ద్వారా.. తన తరపున అడ్వకేట్ ద్వారా తెలియజేశారు. తనకు వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే RGV విన్నపం మేరకు పోలీసులు ఈ నెల 25న  విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

కానీ  విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఆర్జీవి ఇంటికి నేరుగా వెళ్లారు. కానీ అక్కడ ఆయన లేరు. దీంతో ఆర్జీవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టువాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు