BIG BREAKING: మా అన్న లంచగొండి.. జగన్‌పై మరో బాంబ్ పేల్చిన షర్మిల!

లంచాల కోసమే జగన్ అదానీతో ఒప్పందాలకు సంతకాలు పెట్టాడని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలన్నారు. ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు.

New Update
YS Sharmila Jagan

అదానీ కేసులో జగన్ తప్పు చేయలేదని, ముడుపులు తీసుకోలేదని తన పిల్లల మీద ప్రమాణం చేయగలడా? అని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని జగన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అదానీ కేసులో జగన్ తప్పు చేయలేదని, ముడుపులు తీసుకోలేదని తన పిల్లల మీద ప్రమాణం చేయగలడా? అని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని జగన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం, అదానీ ఒప్పందాలపై విచారణ జరిపించాలని గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: RGV Reaction: దయచేసి అర్థం చేసుకోండి.. RGV మరో సంచలన వీడియో!

APCC Chief Y.S. Sharmila Reddy's Press meet Live || Raj bhavan, Vijayawada || 04:30pm@27-Nov-24 ||

APCC Chief Y.S. Sharmila Reddy's Press meet Live || Raj bhavan, Vijayawada || 04:30pm@27-Nov-24 ||

Posted by YS Sharmila Reddy on Wednesday, November 27, 2024

ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం..

అనంతరం మాట్లాడుతూ.. ఈ డీల్ వల్ల ఆంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అదానీకి లాభం కోసమే ఈ డీల్ అని ఆరోపించారు. ఈ డీల్ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. ఈ డీల్ వల్ల ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందన్నారు. ఇప్పటికే రూ.17 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వేశారన్నారు. ఇంత జరిగినా రాష్ట్రం కానీ, కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదన్నారు. మన దేశంలో జరిగిన అవినీతి అమెరికాలో బయట పడిందన్నారు. ఇక్కడ దర్యాప్తు సంస్థలు అన్నీ అదానీ చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను అదానీ గుప్పెట్లో పెట్టుకున్నారన్నారు. అమెరికా ద్వారా ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసిందన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ పాలన ఎలా ఉంది?: మోదీ ప్రశ్నలకు బీజేపీ నేతలు షాక్!

దీంతో అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయిందన్నారు. అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశాడన్నారు. అమెరికాలో చర్యలకు అక్కడ కోర్టులు సిద్ధం అయ్యాయన్నారు. అరెస్టులకు సైతం సిద్ధం అవుతున్నారన్నారు. కానీ మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. ఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. అదానీ, మోడీకి చంద్రబాబు బయపడుతున్నారన్నారు. డీల్ రద్దు కు కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు షర్మిల. 

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

Advertisment
Advertisment
తాజా కథనాలు