Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం కన్నుమూత
హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు పేపర్లు, హెడ్ ఫోన్స్ తో కొట్టుకున్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహంతో స్పీకర్ పోడియం మెట్లు ఎక్కి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు తెలంగాణ భవన్ వద్ద మోహరిస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో నేడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు మరోసారి శాసనసభలో వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు దొంగ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హరీశ్.. నన్ను దొంగ అన్న యూజ్ లెస్ ఫెలో ఎవరు అంటూ ఫైర్ అయ్యారు.
పార్లమెంట్లో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్ల అతని తలకు గాయమైందని ప్రతాప్ ఆరోపించారు. ఈక్రమంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అమిత్ షాపై విరుచుకుపడ్డారు. అమిత్ షాకు పిచ్చి పట్టిందని అందుకే గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్‌ను అవమానించారన్నారు. వెంటనే అమిత్ షా రాజకీయాలకు రాజీనామా చేయాలని లాలూ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కమిషన్ విచారణకు పిలవనుంది. వచ్చే నెలలో కేసీఆర్, హరీశ్ రావుతో పాటు ఈటలను విచారించడానికి కమిషన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
వరదల తర్వాత అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ పొంగులేటి చేసిన కామెంట్స్ పై TDP నేతలు భగ్గుమంటున్నారు. ఇంకా NTR ఘాట్ కూల్చి అసెంబ్లీ కట్టాలన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.