/rtv/media/media_files/2025/01/02/25JzgfuK4qKfXX31FrCr.jpg)
CMR Engineering College CC cameras in girls hostel incident
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) హైటెన్షన్ వాతవరణం నెలకొంది. కాలేజీకి చెందిన గర్ల్స్ హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలను రికార్డు చేస్తున్నారంటూ విద్యార్థినులు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు. వీరికి విద్యార్థి సంఘాల నేతలు కూడా మద్దతు తెలిపి ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డికి (MLA Chamakura Mallareddy) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాత్రి నుంచి కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంట చేసే సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అక్కడివరకు మెట్రో!
ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం: ఏసీపీ
ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాసరెడ్డి (Telangana Police) స్పందించారు. కొద్ది సేపటి క్రితం ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. హాస్టల్ గదిలోని ఒక బాత్రూం వద్ద కిటికీలో నుంచి ఒక అగంతకుడు తొంగి చూశాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వెంటనే స్పాట్ కు చేరుకుని కిటికీ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించినట్లు చెప్పారు. మెస్ లో పనిచేసే 5 మందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు. దీంతో ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. వారి మొబైల్స్ స్వాధీనం చేసుకుని.. అందులోని వీడియోలను చెక్ చేస్తున్నామన్నారు. మొత్తం 11 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. విద్యార్థినుల ఆరోపణలు నిజమని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: Hema: బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట!
Students Protest at #CMREngineeringCollege Over Alleged Privacy Breach
— Clarity Toast (@ClarityToast) January 2, 2025
Medchal District, India | January 1, 2025
Female students at CMR Engineering College in Medchal district held a protest on Wednesday, demanding justice after accusing hostel cooking staff of secretly filming… pic.twitter.com/AOJKs9G84W
భారీగా చేరుకుంటున్న పోలీసులు..
విషయం తెలుసుకున్న పేరెంట్స్ కాలేజీ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హాస్టల్ నిర్వహణలో ఇంత అలసత్వమా అంటూ ఆందోళనలకు దిగుతున్నారు. లక్షల కొద్దీ ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యం.. హాట్లళ్ల వద్ద కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై మల్లారెడ్డి స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.