/rtv/media/media_files/2025/01/02/iA0qxpem1IKn8VMXGp6j.jpg)
Aleti Mahwshwar Reddy
కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తానన్నారు. మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు.
ఇది కూడా చదవండి: ED: కేటీఆర్ కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్..ఏసీబీకి BLNరెడ్డి కీలక లేఖ
రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో చూస్తా..
తాను బయటపెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు. 2024 మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు.
ఇది కూడా చదవండి: Freebies: ఉచితాలపై ఆధారపడొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Live : BJLP Leader, Nirmal MLA Sri Alleti Maheshwar Reddy garu press meet || BJP TELANGANA
— BJP Telangana (@BJP4Telangana) January 2, 2025
https://t.co/dBFR2GMQ6d
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. బీసీ, అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.