MLC Kavitha: బీసీలకు న్యాయం చేయాల్సిందే.. రేవంత్ కు కవిత వార్నింగ్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని రేవంత్ సర్కార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేంద్రం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్నారు. ఇందిరాపార్క్‌లో ఈ రోజు జరిగిన బీసీ సంఘాల మహాసభలో కవిత పాల్గొన్నారు.

New Update
BRS MLC Kavitha

BRS MLC Kavitha BC Meeting

జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లో ఈ రోజు బీసీ సంఘాల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కర్నాటక, బిహార్ వంటి విఫలయత్నాల అనుభవాలు ఉన్న నేపథ్యంలో తొలుత డేడికేటెడ్ కమిషన్ వేయాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడంతో పాటు.. హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నారు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే... మరో కమిషన్ నివేదిక ఇస్తుందన్నారు. ఇలా చేస్తే కోర్టుల్లో ఈ అంశం నిలబడుతుందా? అని ప్రశ్నించారు. 
ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రుల వేలకోట్ల కుంభకోణం.. నా దగ్గర ప్రూఫ్స్: ఏలేటి సంచలనం

కాంగ్రెస్ పై ఫైర్..

బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు తనను ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దాన్ని అమలు చేయాల్సిందేనన్నారు. లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలన్నారు. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని సూచించారు. తమ ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీలకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కవిత.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?

కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారన్నారు. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదన్నారు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదని ఆరోపించారు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసిందన్నారు. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టిందని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించార. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారన్నారు. 2011 కులగణన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదన్నారు.

ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదన్నారు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయన్నారు. తాను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయన్నారు. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు