సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాగ్ పూర్-విజయవాడ కారిడార్ కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
ఇది కూడా చదవండి: BIG Breaking : విచారణకు రండి.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
సమన్వయంతో ముందుకు..
అటవీశాఖ, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ఇందుకు ప్రత్యేకంగా నియమించాలని సీఎం సూచించారు. రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ఒక్కొక్కరికీ 6 కేజీల సన్న బియ్యం.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
No village in #Telangana should remain unconnected by road - CM Revanth Reddy reviewed Regional Ring Road, R&B, and National Highway projects with officials.
— Naveena (@TheNaveena) January 3, 2025
Directed ensuring BT roads from every village to mandal headquarters across the state.
Emphasized designing roads with… pic.twitter.com/CNG9fzS6a1
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలతో సహా ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదు అనే మాట వినపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు.