KTR: ఇదో లొట్టపీసు కేసు.. పసే లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని అన్నారు. అసలు ఈ కేసులో పసే లేదన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. గ్రామ స్థాయి నుంచి బీఆర్ఎస్ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

New Update

ఫార్ములా-ఈ వ్యవహారంలో అసలు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఫార్ములా-ఈ కేసులో హైకోర్టు తీప్పు ఎలా ఇస్తుందో చూద్దామన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని అన్నారు. 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదన్నారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్..అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్

ఇది తనపై ఆరో ప్రయత్నమన్నారు. రేవంత్ కు ఏమి దొరకడం లేదన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి లేదన్నారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని.. వద్దనేది రేవంత్ నిర్ణయమన్నారు. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్ లో చర్చ జరగలేదన్నారు. తనపై కేసు పెడితే.‌. రేవంత్ పై కూడా కేసు పెట్టాలన్నారు.
ఇది కూడా చదవండి: Defence Ministry: ఈ ఏడాది సంస్కరణల సంవత్సరం.. రక్షణశాఖ కీలక ప్రకటన

రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా?

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు కేటీఆర్. ఏడాది మెదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముందన్నారు కేటీఆర్. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు. రైతు భరోసాతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుందని జోస్యం చెప్పారు. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? అని ప్రశ్నించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు