P Kishor: పాట్నాలో ప్రశాంత్‌ కిశోర్‌ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు!

జన్‌సురాజ్‌ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ దీక్ష దగ్గర అతని రూ.కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్‌ ఉండటంతో అవకాశవాది అంటూ ఆర్జేడీ విమర్శలు చేస్తోంది.

New Update
prashant kishore

Prashant kishore

P Kishor: రాజకీయ వ్యూహకర్త, జన్‌సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. బీహార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరుద్యోగులకు మద్ధతుగా రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ పార్క్ చేసిన ఆయన వ్యానిటీ వ్యాన్‌పై పొలిటికల్ వార్ మొదలైంది. దీక్షాశిబిరం పక్కన రూ.కోట్ల విలువైన పీకే వ్యానిటీ వ్యాన్‌ ఉండటంపై పీకే అవకాశవాది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జన్ సురాజ్ పార్టీ విద్యార్థులలో గందరగోళాన్ని వ్యాపింపజేస్తోందని ఆర్జేడీ ఆరోపణలు చేస్తోంది.  

విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం..

ఈ మేరకు బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగానే  పట్నాలోని గాంధీ మైదాన్‌లో మహాత్ముడి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. అయితే విద్యార్థులకు మద్దతుగా పీకే సైతం నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే అతని లగ్జరీ వ్యానిటీ వ్యాన్ పక్కనే ఉంచుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జన్‌సురాజ్‌ నేతలు.. ‘ఇక్కడ సమయ వ్యాను కాదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. పీకే ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే కావాలనే వ్యాన్ అంశాన్ని లాగుతున్నారు' అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: Ambati : పవన్‌కు అంబటి స్ట్రాంగ్ కౌంటర్.. బన్నీ అరెస్ట్ అన్యాయమంటూ!

అలాగే అధికార పార్టీతో పాటు ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. గాంధీ మైదాన్‌లో ఒక రాత్రి గడపాలంటూ నితీష్-తేజస్వి యాదవ్‌లకు సవాలు విసిరారు. ప్రశాంత్ వ్యానులో.. ఏసీతోపాటు బెడ్ రూమ్,  కిచెన్, వాష్ రూమ్ సకల సదుపాయాలున్నాయి. 

ఇది కూడా చదవండి: గోల్డెన్ ఛాన్స్ అందుకున్న భీమ్స్.. మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు