AICC: హైకమాండ్ సంచలన నిర్ణయం.. మున్షీపై వేటు.. కొత్త ఇన్ఛార్జ్ ఎవరంటే? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ ను నియమించాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంకా భారీగా ప్రక్షాళన ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 01 Jan 2025 in తెలంగాణ రాజకీయాలు New Update AICC షేర్ చేయండి వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్.. పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పార్టీ ఇంఛార్జ్‌లను మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీకి స్థాన చలనం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా మున్షీ వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఆమెను ఇన్‌ఛార్జిగా పంపించింది పార్టీ నాయకత్వం. అయితే.. తెలంగాణ కొత్త ఇంఛార్జ్‌గా ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది. పరిశీలనలో అశోక్ గెహ్లాట్, జైరాం రమేష్ పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇన్‌ఛార్జ్ లతో పాటు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: New year 2025: ఖమ్మంలో కుమ్మేశారు.. వంద కోట్లు దాటిన మద్యం అమ్మకాలు! ఎంపీ ఎన్నికల్లో సీట్లు తగ్గడమే కారణమా? గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారీగా సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే.. ఇక్కడ కేవలం 8 సీట్లు మాత్రమే రావడంపై ఆ పార్టీ నేతలు నిరాశకు గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దీపాదాస్ మున్షీ చాలా కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి ఎంపీగా పోటీ చేయించడంతో పాటు అనేక ప్రయోగాలు ఆమె చేశారు. కానీ అవి పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆమెపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మార్పుకు ఇది కూడా ఓ కారణమన్న ప్రచారం సాగుతోంది.ఇది కూడా చదవండి: TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్..అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ స్థానిక ఎన్నికలు.. జనవరి లేదా ఫిబ్రవరిలో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటిలో పీసీసీ కమిటీలు, జిల్లా కమిటీల నియామకం పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జి మార్పు చేపట్టారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఏ మాత్రం తేడా కొట్టినా తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఇది ప్రత్యర్థులకు బలాన్ని ఇస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పకడ్భందీగా అనేక మార్పులను చేపట్టింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి