/rtv/media/media_files/2024/11/27/ZeX72GkkdBFdWIDd4Y3c.jpg)
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ అనేక ఆఫర్లను తీసుకువచ్చారు. తద్వారా ప్రయాణికులను ఆర్టీసీకి మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే సజ్జనార్.. ఆర్టీసీ ఆఫర్లు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. తద్వారా ప్రయాణికులకు ఆయా వివరాలను చేరవేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ ఆర్టీసీ తీసుకువచ్చిన ఆఫర్ గురించి ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: సత్య నాదేళ్లతో రేవంత్ కీలక భేటీ.. ఆ అంశాలపై చర్చ!
Make your commutes smooth and stress-free!
— TGSRTC (@TGSRTCHQ) November 27, 2024
Get your new Metro Deluxe Monthly Pass for just ₹1450 and enjoy hassle-free daily commutes across Hyderabad city. @TGSRTCHQ @tgsrtcmdoffice @Ponnam_INC @TelanganaCMO @CTM_MKTG_TGSRTC #TGSRTC #Telangana #Hyderabad #MetroDeluxe pic.twitter.com/HtZBX0FoTY
జిల్లా బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్..
గ్రేటర్ హైదరాబాద్ రీజియన్లో ఆర్టీసీ నడిపే మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించడానికి మంత్లీ పాస్ ను తీసుకువచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. రూ.1450కే ప్రయాణికులు ఈ బస్సులో నెలంతా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా, ఇంటర్ స్టేట్ బస్సుల్లో పది శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: New Year 2025: మందు బాబులకు న్యూఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా ఇంటికి వెళ్లొచ్చు.. 500 కార్లు రెడీ!
హైదరాబాద్ లో ఉంటూ.. నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ పాస్ సౌకర్యంగా ఉంటుంది. ఈ పాస్ తీసుకున్న వారు మెట్రో డీలక్స్ బస్సులు మాత్రమే కాకుండా.. ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ జర్నీ చేయవచ్చు. అంటే.. ఏసీ బస్సు తప్పా ఏదైనా ఎక్కొచ్చన్నమాట. నెలకు రూ.1450 అంటే.. రోజుకు కేవలం రూ.48 రూపాయలు మాత్రమే చెల్లించి అన్ లిమిటెడ్ గా ప్రయాణం చేయొచ్చన్న మాట. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా హైదరాబాద్ లో ఉంటూ బస్ జర్నీలు చేస్తూ ఉంటే ఈ పాస్ ను తీసుకుని అన్ లిమిటెడ్ గా జర్నీ చేసేయండి మరీ..
Also Read : వామ్మో ఆఫీసులో కునుకు తీశాడని.. ఇన్ని లక్షలు ఫైన్ హా?