Bandi Sanjay: రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్

రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడు.

author-image
By K Mohan
New Update
bandi with rahul gandhi

bandi with rahul gandhi Photograph: (bandi with rahul gandhi)

కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణ సీఎం ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాహుల్ కులం, మతం, జాతి లేనివాడని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్‌ఖాన్ గాంధీ ముస్లీం, ఆయన మాత్రం బ్రాహ్మణుడని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!

Also Read :  పోలీసును ఢీకొట్టి బైక్ పై గంజాయితో.....

Bandi Sanjay Comments On Rahul Gandhi

రాహుల్ తల్లి సోనియా క్రిస్టియన్ అని బండి చెప్పుకొచ్చారు. రాజీవ్ తండ్రి ముస్లిం అయితే రాహుల్ కూడా ముస్లిం అవుతాడని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లీమే అవుతాడని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అని అన్న విషయం తెలిసిందే. బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ఇస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మోదీ కులంపై విమర్శలు చేశారు. 

Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

Also Read :   వాటిని రూ.9 లక్షల కోట్లకు పెంచడమే టార్గెట్‌: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ (Congress Party) 10 శాతం ముస్లింలను బీసీలుగా మార్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వెనుకబడిన వారికిచ్చే 42 శాతం రిజర్వేషన్‌లో బీసీలకే 10 శాతం పోతే.. హిందూ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 32శాతమేనని బండి సంజయ్ అన్నారు. హిందూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తేనే కేంద్రం బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరిస్తుందని తేల్చి చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు