/rtv/media/media_files/2025/02/16/fmBcQKFQDyn6Ntvv7zDe.jpg)
MK -84 Photograph: (MK -84)
హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయిల్‌కు అమెరికా ఆయుధాలు సమర్చుతుంది. ఆర్థికసాయం కూడా అందిస్తోంది. అమెరికా నుంచి ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన 2000 ఫౌండ్ల బరువున్న MK-84 బాంబులు (MK-84 Bombs) శనివారం రాత్రి ఇజ్రాయిల్‌లోని పోర్ట్‌కు చేరుకున్నాయి. ఈ బారీ పేలుడు పదార్థాలు షిప్‌ల ద్వారా అష్డోడ్ ఓడరేవుకు చేరుకున్నాయి. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. దీనికి అమెరికా మద్దత్తు పలుకుతుంది. హమాస్‌కు పట్టబడిన ఇజ్రాయిల్ బందీలను వదలకపోవడంతో గాజాపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది.
Also Read : మేడిగడ్డను కూల్చాల్సిందే ..ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్!
ఒకానొక దశలో ఈ రెండు దేశాలకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగి బందీలను విడుదల చేసుకుంటున్న సమయంలో హమాస్, ఇజ్రాయిల్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ పరిస్థితులు మళ్లీ యుద్ధ వాతావరణానికి దారి తీస్తున్నాయి. ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని హమాస్ ఆరోపించింది. గాజాలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయాడానికి హమాస్ నిరాకరించింది. దీంతో ఇజ్రాయిల్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్‌పై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
MK-84 Bombs Arrived In Israel
EEUU envía a Israel las bombas MK-84, que Biden había “congelado” por su enorme poder destructivo y el riesgo de uso en Gaza.
— Almudena Ariza (@almuariza) February 16, 2025
Con la luz verde de Trump, ya están en suelo israelí.
Cada bomba pesa una tonelada, abre cráteres de 15 m y su radio letal alcanza 366 m. Una sola puede… pic.twitter.com/2s39gRqs3X
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
ఈ క్రమంలో అమెరికా (America) నుంచి ఇజ్రాయిల్ (Israel) కు ఆయుధాలు రవాణా చేయడం కలవరం రేపుతుంది. ఫిబ్రవరి 15 రాత్రి అమెరికా MK-84 బాంబులు ఇజ్రాయిల్‌కు చేరుకున్నాయని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. వాటిని ట్రక్కుల్లో ఇజ్రాయిల్ వైమానికి స్థావరాలకు తరలిస్తున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇజ్రాయిల్‌కు చేరుకోవాల్సిన ఈ బాంబుల ఆయన నిలిపివేశాడు. ఈ MK-84 ఆయుధాలు గాజాలోని సామాన్య పౌరులపై ప్రభావం చూపుతాయనే కారణంతో బాంబుల రవాణా బైడెన్ తాత్కాలికంగా ఆపివేశాడు.
Also Read : హైదరాబాద్ వాసులకు అలర్ట్ .. రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో వాటర్ బంద్.. లిస్ట్ ఇదే!
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వీటిని ఇజ్రాయిల్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు. జనవరి 25న సముద్ర మార్గాన బయలుదేరిన 2000 ఫౌండ్ల MK -84 బాంబాలు శనివారం రాత్రి ఇజ్రాయిల్‌కు చేరుకున్నాయి. ఇజ్రాయిల్ అమెరికా నుంచి కొనుగోలు చేసిన76వేల టన్నుల ఆయుధాల్లో MK -84 బాంబాలు కూడా భాగమే. ఇప్పటి వరకు అమెరికా విమానాల్లో 678, సముద్ర మార్గాన 129 ఆయుధాలు ఇజ్రాయిల్‌కు సరఫరా చేసింది.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా