ganja gang : పోలీసును ఢీకొట్టి బైక్ పై గంజాయితో.....

భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. వారిని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది.

New Update
ganja gang

ganja gang

ganja gang : తెలంగాణలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో గంజాయి రవాణా కూడా మితిమీరుతోంది. తెలంగాణ, ఛత్తీస్​ గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తుండగా వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. కాగా పోలీసును ఢీకొట్టి బైక్ పై నిందితులు పరారవుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

 గత కొన్ని రోజులుగా  తెలంగాణ, ఛత్తీస్​ గఢ్, ఒడిశా సరిహద్దు నుంచి భద్రాచలం మీదుగా గంజాయి సరఫరా దారులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలా తరలించిన గంజాయిని హైదరాబాద్​, మహారాష్ట్ర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు .దీంతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్​ రాజ్ భద్రాచలంలో 24 గంటల పాటు బ్రిడ్జి సెంటర్​ చెక్​ పోస్ట్‌ వద్ద పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

ఈ క్రమంలోనే శనివారం ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా, బ్రిడ్జి సెంటర్​ చెక్​ ఫోస్ట్‌  వద్ద ఓ కానిస్టేబుల్​ ఆ బైకును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వారు బైకును ఆపకుండా అక్కడున్న బారీకేడ్ ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి మరీ దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో పోలీస్​ రహదారిపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవగా, అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు


 రాష్ట్రంలో గంజాయి మాటే వినపడకూడదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు పోలీసులు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గంజాయి అక్రమరవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.  

Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!

Advertisment
తాజా కథనాలు