/rtv/media/media_files/2025/02/16/MXcmxgH7XbDzcZHcaiPn.jpg)
Poultry truck overturns on UP e-way
ఇప్పుడంతా బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ బారిన పడి ఎన్నో వందల కోళ్లు చనిపోయాయి. దీంతో ప్రజల్లో సైతం భయం ఏర్పడింది. వైరస్ బారిన పడిన కోళ్లు తింటే ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నారు. దీని కారణంగా చికెన్ ధరలు తగ్గాయి. దీంతో మీకు చికెన్ తక్కువ ధరకే ఇస్తాం తీసుకోండ్రా బాబు అని కొన్ని ప్రాంతాల్లో అంటుంటే.. ఇక్కడ మాత్రం దొరికినన్ని కోళ్లు దోచుకో అన్నట్లు ఒక్కొక్కరు రెండు చేతుల నిండా కోళ్లను పట్టుకు పరుగెడుతున్నారు. ఆ సంఘటన చూస్తే మాత్రం.. అసలు బర్డ్ ఫ్లూ భయమే లేదు అన్నట్లు అనిపిస్తుంది.
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
కోళ్ల ట్రక్కు బోల్తా
Kannauj, UP: A pickup truck carrying chickens from Amethi to Firozabad overturned on the Kannauj expressway after the driver fell asleep. Videos of people looting chickens went viral. Police and UPEIDA personnel intervened, dispersing the crowd, while the injured were… pic.twitter.com/FF6lRshsvp
— IANS (@ians_india) February 15, 2025
ఉత్తరప్రదేశ్ కన్నౌజ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై కోళ్లను రవాణా చేస్తున్న ఒక ట్రక్కు బోల్తా పడింది. దీంతో అది గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే కోళ్ల కోసం పెద్ద ఎత్తున పరుగులు తీశారు. చేతికి ఎన్ని దొరికితే అన్ని కోళ్లను పట్టుకుని తమ ఇళ్లకు పరిగెట్టారు. కానీ గాయపడ్డ డ్రైవర్, క్లీనర్‌లను అక్కడే వదిలేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
ప్రమాదానికి కారణం ఇదే
అయితే ఈ సంఘటన జరిగిన అనంతరం పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై డ్రైవర్, క్లీనర్‌ను కన్నౌజ్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం అదనపు ఎస్పీ అజయ్ కుమార్ మాట్లాడారు. ఈ యాక్సిడెంట్‌కు గల కారణాన్ని ఆయన తెలిపారు.
Poultry truck overturns on UP e-way, villagers scramble to grab chickens
— The Times Of India (@timesofindia) February 16, 2025
Details here 🔗 https://t.co/KxHLOxBbeU#UttarPradesh pic.twitter.com/6VPY0EAruP
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
‘‘ఈ సంఘటన కన్నౌజ్‌లోని సకరావ ప్రాంతంలో జరిగింది. డ్రైవర్ సలీం, కలీం అనే వ్యక్తులు అమేథి నుండి ఫిరోజాబాద్ కు ఆగ్రాలక్నో ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా కోళ్లను రవాణా చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సకారావాలోకి రాగానే డ్రైవర్ సలీం నిద్రలోకి జారుకుని వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
దీంతో ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అక్కడకి ప్రజలు వచ్చి కోళ్లను తీసుకెళ్లిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో మేము ఉన్నాము. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. సమీప గ్రామస్తులు కోళ్లను తీసుకుని పరుగులు తీశారు. కానీ గాయపడిన వారిని నిర్లక్ష్యం చేశారు’’ అని ఆయన తెలిపారు. ఈ సంఘటనతో కొద్దిసేపు ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.