/rtv/media/media_files/2025/02/16/ZtIMKw8EzdXiXdA5vsuz.jpg)
PM Modi
జౌళి ఉత్పత్తులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు జరుగుతున్న భారత టెక్స్ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. టెక్స్‌టైల్ రంగంలో వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే రూ.9 లక్షల కోట్ల టార్గెట్‌ను సాధిస్తామని పేర్కొన్నారు. ఈ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, దీనిద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు.
Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
PM Modi - Textile Exports
'' ప్రపంచంలో అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా భారత్ ఆరో స్థానంలో ఉంది. గతేడాది 7 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లుగా ఉన్న వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే రూ.9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్ టెక్స్ 2025 కార్యక్రమంలో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. భారత్ హై-గ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీ దిశలో ముందుకు సాగుతోంది.
Also Read: ఇప్పుడు వేయండ్రా విజిల్స్.. నాగ చైతన్య ‘తండేల్’ కలెక్షన్స్ చూస్తే షాకై షేకైపోతారు!
వస్త్ర రంగంలో స్కిల్స్ కలిగిన ప్రతిభావంతులను తయారుచేసేందుకు కృషి చేస్తున్నాం. సాంకేతిక వస్త్ర రంగంపై కూడా ఫోకస్ పెట్టామని'' ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఇదిలాఉండగా.. ప్రధాన పత్తి రకాల ఉత్పాదకను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో కాటన్ మిషన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 2025-26 బడ్జెట్‌లో జౌళి మంత్రత్వ శాఖకు కేంద్రం రూ.5,272 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈసారి 19 శాతం అధిక కేటాయింపు జరిగింది.
Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు