HCU land dispute: ‘కంచ’ చేను మేస్తే.. ఆ 400 ఎకరాల భూమి ఎవరిదంటే..?

HCU భూవివాదంతో 400 ఎకరాలు ఎవరిది? 1974లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఆ భూవివాదం కొనసాగుతోంది. 2004లో చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి కేటాయించిన ఆ 400 ఎకరాల భూమిపైనే ఇప్పుడు కూడా వివాదం. ఆ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By K Mohan
New Update
HCU land 12563

HCU land 12563

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఇది కేవలం విశ్వ విద్యాలయం మాత్రమే కాదు, పబ్లిక్ రీసెర్చ్ సెంటర్ కూడా. HCU తెలంగాణ రాష్ట్రానికి ఓ వరమనే చెప్పాలి. ఎందుకంటే ఇది విద్యారంగంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడాని ఏర్పాటు చేయబడింది. 1973లో సిక్స్ పాయింట్ల ఫార్మూలాలో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ఓ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. 1974 ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించారు. దీనికి కోసం రాష్ట్రరాజధాని హైదరాబాద్ శివారు కంచ గచ్చిబౌలి ప్రాంతంలో 2324 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ వాటి హద్దులు మాత్రం అప్పుడు నిర్ణయించలేదు. ఈ యూనివర్సిటీ భూముల వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. HCU పక్కనున్న 400 ఎకరాల ఖాళీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అమ్మాలని నిర్ణయించుకుంది. మార్చి 30న 50 జేసీబీలతో ఆ ల్యాండ్‌ను చదును చేయడానికి అధికారులు వెళ్లారు. యూనివర్సిటీ విద్యార్థులు జేసీబీలను అడ్డుకున్నారు. యూనివర్సిటీ భూములు ప్రైవేట్ సంస్థలకు అమ్మడానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పోలీసుల వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, HCUకి మధ్య వివాదం స్టార్ట్ అయ్యింది.. దీని HCU బ్యాగ్రౌండ్, ఆ ల్యాండ్ వివాదం ఏంటో చూద్దాం..

Also Read :  ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

ఇందులో 5000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 400 మంది ఫ్రొఫెసర్లు ఉన్నారు.  స్టడీ ఇన్ ఇండియా అనే సెంట్రల్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 20 దేశాల నుంచి చదువుకోడానికి 200 మంది విద్యార్థులకు పైగా హైదరాబాద్ వస్తున్నారు. థాయ్‌లాండ్, మయన్మార్, సిరియా, మంగోలియా, సౌత్ ఆఫ్రికా, గయానా, ఫిలిప్పీన్స్, ఇరాన్, టాంజానియా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, జపాన్, వియత్నాం, యెమెన్ దేశాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇందులో చదివిన వారు ఎంతో మంది IPS, IAS, IFS లాంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. అంతేకాదు ప్రస్తుత తెలంగాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి  విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబులు కూడా ఇదే యూనివర్సిటీలో చదువుకున్నారు. దళిత ఉద్యమకారుడు రోహిత్ వేముల, యాక్టర్ ప్రియదర్శి, చాలామంది గొప్ప రచయితలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న గొప్ప ఫ్రొఫెసర్లు ఈ యూనివర్సిటీలో బోధిస్తుంటారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంత సిన్హా, పద్మశ్రీ దీపాంకర్ ఛటర్జీ, సాహిత్య అకాడమీ యువ పురస్కార విజేత గణేష్ పుత్తూరు, శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి గ్రహీతలు రాహుల్ బెనర్జీ, UK ఆనందవర్ధనన్ లు HCUలో ఫ్రొఫెసర్లుగా పని చేశారు.

Also Read :  తరచుగా పార్కులకు వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి

HCU రికార్డులు

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ 2024 ర్యాకింగ్‌లో ఇండియాలోని మొత్తం విద్యాసంస్ధల్లో 25వ స్థానంలో, విశ్వవిద్యాలయాల్లో 17వ ప్లేస్‌లో నిలిచింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాగింగ్‌ 2025లో యూనివర్సిటీకి 801 స్థానం వచ్చింది. ఇండియా టుడే 2020లో ఇచ్చిన ర్యాకింగ్‌లో దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో 2వ స్థానం HUC కైవసం చేసుకుంది. ప్రతి సంవత్సరం దాదాపు 300 డాక్టరేట్‌లను HCU ప్రదానం చేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కింద స్వయం సెల్ఫ్ అటానమస్ విశ్వవిద్యాలయంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నడుస్తోంది. UGC , CSIR , DST , DBT , FIST లాంటి ఇతర సంస్థల నుంచి యూనివర్సిటీకి రీసెర్చ్ ఫండ్స్ వస్తాయి. ఇందులో 40 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

గతంలో ఈ 400 ఎకరాల వివాదం

2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో కీడారంగాన్ని అభివృద్ధి చేయాలని ఐఎంజీ భారత్ అకాడమి అనే స్పోర్ట్స్ కంపెనీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆ కంపెనీ ఓనర్ బిల్లి రావు అలియాస్ అహోబిల రావుకు గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ పక్కను ఉన్న 400 ఎకరాలు, శాంషాబాద్‌లోని మరో 450 ఎకరాలు కేవలం రూ.2కోట్లకే అప్పటి గవర్మమెంట్ అమ్మింది. అంతేకాదు రాష్ట్రంలో స్పోర్ట్స్ యాక్టివిటీని పెంచాలనే ఉద్యేశ్యంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్నీ స్టేడియాలను 45ఏళ్ల వరకు ఐఎంజీ భారత్‌ అకాడమికీ లీజుకు ఇచ్చేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 2004లో అధికారం మారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యారు. ఐఎంజీ భారత్ అకాడమి బోగస్ కంపెనీ అని తేలడంతో 2006లో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంది అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించాడు. ఏళ్ల తరబడి వాదనలు విన్న తర్వాత ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని 2024 మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఐఎంజీ భారత్ అకాడమి కంపెనీ సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు సమర్థిస్తూ 2024మేలో ఆ కేసును కొట్టివేసింది. అప్పటి నుంచి సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవని కోర్టు తీర్పు ప్రకారం ఉంది.
ఐటీ, ఇత‌ర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎక‌రాలు కేటాయించాల‌ని టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) గతేడాది జూన్ 19న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపాద‌న‌లు స‌మ‌ర్పించింది.

Also Read :  ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌..

సర్వే నెం.25 ల్యాండ్ 400 ఎకరాలు ఎవరింటే..?

కంచ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల సర్వే నెం.25 భూమి గురించే ప్రస్తుతం ఈ వివాదం. ఆ భూమి యూనివర్సిటీని కాదని.. ప్రభుత్వ భూమి అని తెలంగాణ సర్కార్ అంటోంది. అది HCU ల్యాండ్ అని యూనివర్సిటీ వాదిస్తోంది. 2003లో 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని, గోపన్‌పల్లి వైపు 397 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయిస్తామని చెప్పింది. అలా ఇచ్చిన భూమిలో కూడా చాలామొత్తం తిరిగి టీఐఎఫ్ఆర్ వంటి సంస్థలకు గవర్నమెంట్ కేటాయించింది. అప్పట్లో ఐఎంజీ భారత్ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం, HCU మధ్య ఒప్పందం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం.. ఐఎంజీ భారత్ పనులు చేయకపోతే తిరిగి ఆ 400 ఎకరాలు యూనివర్సిటీకే చెందాని అగ్రిమెంట్ ఉంది. కానీ కోర్టు కేసులు నడిచినప్పుడు యూనివర్సిటీ కలగజేసుకోలేదు. దీంతో ఆ 400 ఎకరాల కోసం ఇప్పటిదాక న్యాయపోరాటం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని కోర్టు చెప్పింది. యూనివర్సిటీ అధికారులే ఆ 400 ఎకరాలు తమ భూములు కావని చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు మార్చి 25న అసెంబ్లీలో చెప్పారు. హెచ్సీయూలో ఒక్క గజం భూమిని కూడా తాము ముట్టుకోమని ఆయన అన్నారు.

HCU వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం

2013లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసి యూనివర్సిటీ కింద 1626 ఎకరాలు ఉన్నట్లు తేల్చింది. ఆ భూములను యూనివర్సిటీ పేరు మీదకు బదలాయించాలని వర్సిటీ అధికారులు అప్పటి నుంచీ కోరుతూనే వస్తున్నారు. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. HCU కి ఇచ్చిన భూములను ఇతర అభివ‌ృద్ధి పనులకు కేటాయిస్తున్నారు. యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లోనే గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ట్రిపుల్ఐటీ సహా వేర్వేరు సంస్థలకు స్థలాలు కేటాయించారని HCU అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 800 ఎకరాలు తగ్గాయని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. యూజీసీ లెక్కల ప్రకారం HCUకి అక్కడ 1800 ఎకరాల ల్యాండ్ ఉంది. 

2024 జూన్‌లోనే 400 ఎకరాలను రెవెన్యూ అధికారులతో సర్వే చేయించామని టీజీఐఐసీ చెప్పుకొస్తోంది. యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ రిజిస్ట్రార్ పర్మిషన్‌తోనే 2024 జులై 19న యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్‌, యూనివ‌ర్సిటీ ఇంజినీర్‌, యూనివ‌ర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, మండ‌ల స‌ర్వేయ‌ర్ స‌మ‌క్షంలో స‌ర్వే చేసి హ‌ద్దులు నిర్ధరించామని ప్రభుత్వం చెబుతోంది.

యూనివర్సిటీకి చెందిన భూముల వేలం వేయాలన్నా.. అమ్మాలన్నా సరే రాష్ట్రపతి నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారానే జరుగుతుందని మార్చి 31న HCU ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల్లో 2024 జూన్‌లో సర్వే జరగలేదని చెప్పుకొచ్చింది. అప్పుడు కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. అంతేకాదు HCU భూముల అమ్మకానికి తాము ఎప్పుడూ ఒప్పుకోలేదని కూడా తెలిపింది. ఆ 400 ఎకరాల్లో ఉన్న జీవవైవిద్యం, పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Also Read :  పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

400 ఎకరాల్లో పచ్చని ప్రకృతి

ఆ 400 ఎకరాల ల్యాండ్ విషయంలో యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటల మధ్య పొంతన కుదరం లేదు. అందుకే ఈ వివాదం. ఏది ఏమైనా ఆ 400 ఎకరాల భూమిలో పీకాక్ లేక్, బఫెల్లో లేక్, మలబార్ కుంద్ అనే చెరువులు ఉన్నాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్ సిటీ పొల్యూషన్ ప్రమాదంలో పడకుండా కాపాడేందుకు ఈ అడవి ప్రాంతం ఉపయోగపడుతుంది. అంతేకాదు అక్కడి పచ్చని ప్రకృతిలో మష్‌రూమ్ రాక్ అనే సహజ సిద్ధ బండరాళ్లు ఉన్నాయి. నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు, మచ్చల జింకలు వంటి అద్భుతమైన జీవరాశి కూడా ఆ భూముల్లో ఉన్నాయి. 734 మొక్కలు,10 క్షీరదాలు, 15 సరీసృపాలు, 220 పక్షులు HCU కాంపస్ ఏరియాలో ఉన్నాయని సమాచారం. ఇప్పుడు ఆ భూమిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడితే పచ్చని ప్రకృతి నాశనం అవుతుందని HCU విద్యార్థులు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు. 1990–2010 జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, క్యాంపస్‌లో 315 జాతుల మొక్కలు ఆయుర్వేదానికి వినియోగించేవి ఉన్నాయి. అంతరించిపోతున్న జాతులకు చెందిన 39 రకాల మొక్కలు కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉన్నాయని లెక్చరర్లు, వాటిపై రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు చెబుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీని ఒక బయో రిజర్వ్‌గా చేస్తే అటవీ ప్రాంతం, చిత్తడి నేలలను రక్షించుకోవచ్చని పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అభివృద్ధి పేరిట అడవులను నరికివేస్తే చివరికి పీల్చుకోడానికి గాలి కూడా దొరకదు కదా.

రూ.10వేల కోట్ల కోసమే..

హైదరాబాద్ చుట్టు ఉన్న ఐటీ కారిడార్ కారణంగా ఈ భూములకు మంచి డిమాండ్ ఉంది. ఆ 400 ఎకరాల భూమి వేలం వేసి ఐటీ కంపెనీలకు అమ్మితే.. అటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, అలాగే తెలంగాణలో ఐటీ రంగం డెవలప్‌ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ భూములు ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తే రూ.50వేల పెట్టుబడులు వస్తాయని అంచనా. దాంతోపాటు 5వేల మందికి ఉపాధి లభిస్తోందని సర్కార్ ఆలోచన. ప్రస్తుతం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం.. ఆ 400 ఎకరాలు భూమిని అమ్మితే రూ.10 వేల కోట్ల ఆదాయం గవర్నమెంట్‌కు వచ్చే అవకాశం ఉంది. అందుకే అధికారులు ఆదివారం(మార్చి 30, 2025)న ఆ 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, గుట్టలు, రాళ్లు రప్పలు తొలగించే పనులు ప్రారంభించింది. రాత్రిపగళ్లు జేసీబీలతో భూమిని చదును చేస్తున్నారు. 2రోజుల్లోనే 400 ఎకరాల్లో ఉన్న సగం అడవి ప్రాంతాన్ని క్లీన్ చేశారు. ఈ క్రమంలోనే HCU  విద్యార్థులు వారిని అడ్డుకోవాలని ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వందలాది మంది సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర దీక్షకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా హెచ్సీయూ స్టూడెంట్ల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.

సుప్రీంకోర్టు కేంద్ర కమిటి

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు చురకలు అంటించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు సుప్రీం కోర్టు, హైకోర్టును ఆశ్రమించారు. ఏప్రిల్ 3న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. పర్యావరణ విభాగ అనుమతి తీసుకోకుండా దాదాపు 100 ఎకరాల్లో ఎందుకు చెట్లు తొలగించారని రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించింది. ఈ విషయంపై పూర్తి విచారన జరపడానికి ఓ ఎంపవర్డ్ కమిటీని నియమించింది. ఏప్రిల్ 16 వరకు కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల భూవివాదంలో జరిగిన వాస్తవాలపై అధ్యాయనం చేయనుంది ఈ కేంద్ర కమిటీ. ఆ 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతను నిలిపివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యకు పూర్తి భాద్యత సీఎస్ వహించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్సీయూ భూవివాదంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్, మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటితో ఓ కమిటి వేసింది. కంచ గచ్చిబౌలి భూవివాదంలో మంత్రి విధ్యార్ధి నాయకులు , సోషల్ యాక్టివిస్టులతో చర్చలు జరుపుతున్నారు. 2300 ఎకరాల భూములు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు కేటాయించినప్పటికీ.. దాని హద్దులు నిర్ణయించపోవడం వల్లే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. అటు కాంగ్రెస్ అధిష్ఠానం, ఇటు రాష్ట్ర  ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

ఒపీనియన్

ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిది అని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.. మరి ఆ యూనివర్సిటీ ఎవరిది..? యూనివర్సిటీ కూడా గవర్నమెంట్‌దే కదా.. అలాంటప్పుడు అది ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల పరం చేయాలి. పచ్చని ప్రకృతిని నశనం చేసి మరీ.. ఆ 400 ఎకరాల అడవి భూమి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. కావాలంటే 400 ఎకరాల భూమి వేరే చోటు కేటాయించవచ్చు. కానీ అదే 400 ఎకరాల్లో చెట్లను పెంచాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఆ భూమిని ఎకో పార్క్ చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తోంది.

 

400 acres hcu land issue | HCU Land Dispute | hcu land auction issue | latest-telugu-news | latest telangana news | telangana news today | telangana news live updates | breaking news in telugu | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు