/rtv/media/media_files/2025/04/10/AOM9OoyHcfTWJXrGcHou.jpg)
earthquake warning for Andhra Pradesh and Telangana soon
ఈ మధ్య వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించని భూప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే దేశ, ప్రపంచ వ్యాప్తంగా భూమి కంపించింది. అందులో గతంలో ఏపీ, తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాలను భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది.
ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
తాజాగా మరోసారి భూకంప హెచ్చరికలు వచ్చాయి. తెలంగాణలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో రామగుండం కేంద్రంగా భారీ భూకంపం ప్రజలను భయపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి భూకంప తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
ఏపీ & తెలంగాణలో భూకంపం
ఈ మేరకు Epic -Earthquake Research & Analysis ఒక ట్వీట్ చేసింది. అందులో హైదరాబాద్, వరంగల్.. అలాగే అమరావతి వరకు ప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. తమ పరిశోధనల ఆధారంగా రాష్ట్రంలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చింది.
As per our research & analysis #upcoming significant #earthquake possible near #Ramagundam #Telangana south #India #tremors may reach up to near #Hyderabad #Warangal #Amaravathi #AndhraPradesh #Maharashtra
— Epic ( Earthquake Research & Analysis ) (@epic_earthquake) April 9, 2025
~18.73°N 79.62°E
~10-17 April 2025
~5 #Magnitude pic.twitter.com/COhmgcHcnq
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
అయితే ఈ భూకంపాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు. కాగా అప్రమత్తంగా ఉండటం మంచిదే. కానీ నిర్ధారణలేని సమాచారంపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
(ap earthquake | ap earthquake latest news latest-telugu-news)