Bihar Results Live: ఎన్నికల ఫలితాల్లో స్టార్ సింగర్ ముందంజ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ప్రారంభమైయ్యాయి. తొలి ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులు బలమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ప్రారంభమైయ్యాయి. తొలి ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులు బలమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలీనగర్‌లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి దశలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. మొత్తం 9 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాఘటబంధన్ 6 స్థానాలతో ఆధిక్యంలో లేదు. ప్రస్తుతానికి ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో ఆత్మాహుతి బాంబ్ గా ఉన్న ఉమర్ నబీ ఇంటిని అర్థరాత్రి హద్రతా దళాలు పేల్చేశాయి. జమ్మూకశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూల్చివేత ప్రక్రియను చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించున్నారు.
బిహార్ ఎన్నికల ఫలితాల్లో మొకామా నియోజకవర్గంలో అనంత్ సింగ్ విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అతను విందు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబ్ జామున్లు 2 లక్షల వరకు తయారు చేయిస్తున్నారు.
పీపుల్స్ పల్స్ ప్రకారం, 2020లో కాంగ్రెస్ సాధించిన 9.6% ఓట్ల వాటాను జన్ సురాజ్ పార్టీ అధిగమిస్తుందని అంచనా వేసింది. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ కు వచ్చే ఓట్లను కూడా ఈ పార్టీ చీల్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.