/rtv/media/media_files/2025/11/14/brs-leads-2025-11-14-10-33-46.jpg)
Bihar Results Live: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ప్రారంభమైయ్యాయి. తొలి ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులు బలమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా దర్భంగా జిల్లాలోని అలింగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ప్రముఖ ఫోక్ సింగర్, బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ ముందంజలో ఉన్నారు. 3794 ఓట్లతో మైథిలి ఠాకుర్ ముందంజలో ఉన్నారు.
#BiharElection2025 | Singer and BJP candidate Maithili Thakur leading from Alinagar with a margin of 1826 votes after round 1/24 of counting. pic.twitter.com/vjLNWVBO58
— ANI (@ANI) November 14, 2025
ప్రారంభ రౌండ్లలో వచ్చిన లెక్కింపు వివరాల ప్రకారం, మైథిలి ఠాకూర్ తన ప్రధాన ప్రత్యర్థులపై చెప్పుకోదగిన లీడ్‌ను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న 25 ఏళ్ల ఈ యువ గాయని, తన గాన ప్రతిభతో పాటు స్థానిక 'మిథిలాంచల్' సంస్కృతిపై ఆమెకున్న పట్టుతో ప్రజల్లోకి దూసుకువెళ్లారు. ఎన్నికల ప్రచారంలో ఆమె యువత, మహిళా సాధికారత, విద్యాభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
బీజేపీ ఈసారి మైథిలి ఠాకూర్‌ను బరిలోకి దించడం ఒక సంచలన నిర్ణయంగా మారింది. అలింగర్ నియోజకవర్గం బ్రాహ్మణుల ఆధిపత్యం, ముస్లిం, యాదవ్ ఓటర్లు గణనీయంగా ఉండే స్థానం. ఇక్కడ ఆమెకు ఆర్జేడీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే, మొదటి రౌండ్లలో లభిస్తున్న ఆధిక్యం ఆమె గెలుపుపై ఆశలు పెంచుతోంది. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ (MGB) కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మైథిలి ఠాకూర్ ఆధిక్యం బీజేపీలో ఉత్సాహాన్ని నింపుతోంది.
Follow Us