Bihar Elections: బీహార్ లో ఆర్జేడీని ముంచిన కాంగ్రెస్.. MGB దారుణ ఓటమికి కారణం ఇదే!

బీహార్ లో పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా ఓటమి దిశగా పయనిస్తోంది. కేవలం 20 స్ధానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కారణంగా మహాఘట్ బంధన్ ఈసారి కూడా ఓడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

New Update
congress

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మహాఘటబంధన్ తో పొత్తు పెట్టుకుని 61 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇంతకు ముందు కంటే తక్కువ రిజల్ట్ ను నమోదు చేసుకుంటోంది. 76 స్థానాల్లో నితీశ్ కుమార్ పార్టీ ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 64, మహాఘట్బంధన్ 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిశోర్ జనసురాజ్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది.

నిలబడలేకపోయిన కాంగ్రెస్..

బీహార్ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్సే పెద్ద కారణం అని చెబుతున్నారు.  టికెట్ కేటాయింపు దగ్గరే ఆ పార్టీ అడుగులు వెనక్కు పడ్డాయి. టికెట్ల కేటాయింపును ఒక పట్టాన తేల్చలేదు. చివర వరకు దాన్ని సాగతీసింది. తరువాత ప్రచారం సమయంలో కాంగ్రెస్ కూడా పెద్దగా ప్రభావం చూపించ లేకపోయింది. బీజేపీ తరహాలో పెద్దన్న పాత్రను పోషించ లేకపోయింది. తన కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని వెళ్ళడంలో విఫలం అయింది. దీని ప్రభావం ఆర్జేడీ మీద కూడా పడింది. టోటల్ గా మహాఘట్ బంధన్ ఓటమి దిశగా ప్రయాణిస్తోంది.

అప్పుడు కూడా ఇంతే...

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్జేడీ 75 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన కారణంగా ప్రభుత్వాన్ని మాత్రం స్థాపించలేకపోయింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 70 సీట్లకు గానూ కాంగ్రెస్ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 243 సభ్యుల అసెంబ్లీలో మెజారిటీని సాధించింది. ఇందులో బీజేపీ 74 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. జెడి(యు) 43 సీట్లు గెలుచుకుంది.