Jyoti Malhotra: పహల్గామ్ దాడి తర్వాత ఇండియా- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో భారత దేశానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ కి గూఢచారిగా పనిచేస్తూ పట్టుబడడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు చేరవేస్తోందనే ఆరోపణలతో హిసార్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఆమెపై ఆఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రాకు సంబంధించి పలు షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి.
3.81 లక్షల సబ్స్క్రైబర్లు
హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన జ్యోతి మల్హోత్రా, “Travel with Jo” అనే పేరుతో 2011లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇప్పటివరకు 487 వీడియోలు అప్‌లోడ్ చేయగా.. ఆమెకు 3.81 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ వీడియోల్లో జ్యోతి వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తూ అక్కడ వివరాలను పంచుకుంటుంది. బాంగ్లాదేశ్, భూటాన్, కాశ్మీర్, పాకిస్థాన్ వంటి ప్రదేశాలను సందర్శించింది. ఆమె తనను “Nomadic Leo Girl”, “Wanderer Haryanvi Punjabi”గా పరిచయం చేసుకుంది. Nomadic అంటే సంచారం (travelling) అని అర్థం.
/rtv/media/media_files/2025/05/18/ITsvmrWscQ2RQhLlHVQV.png)
“జట్ రంధావా” పేరుతో కాంటాక్ట్స్
2023లో జ్యోతి రెండు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఆమె అలి ఎహ్వాన్, షాకిర్, రానా షాహబాజ్ అనే వ్యక్తులను కలిసినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా వారి ఫోన్ కాంటాక్ట్‌లను “జట్ రంధావా” పేర్లతో సేవ్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఆమె ఇండోనేసియా (బాలి) కూడా వెళ్లి.. అక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో కలిసి ప్రయాణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
/rtv/media/media_files/2025/05/18/5ueDMYROYrsnPXvSPc2c.png)
పాకిస్తాన్ అధికారులతో ఇఫ్తార్ పార్టీ..
జ్యోతి మల్హోత్రా షేర్ చేసిన ఒక వ్లాగ్ వీడియోలో ఆమె పాకిస్థాన్ అధికారులతో కలిసి ఇఫ్తార్ పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. కిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఇఫ్తార్ పార్టీ జరగగా.. అందులో ఆమె ఎహ్సాన్ ఉర్ రహీమ్‌ను సన్నిహితంగా వ్యవహరించారు.
/rtv/media/media_files/2025/05/18/FATJyEVy6DFD9ZGI1zWR.png)
2024లో పోలీసులకు హెచ్చరిక..
2024 లోనే జ్యోతి మల్హోత్రా కదలికల పై ఓ వ్యక్తి పోలీసులను హెచ్చరించారు. కపిల్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా NIA కి హెచ్చరిక పంపాడు. జ్యోతి పాకిస్తాన్ ఎంబసీ ఫంక్షన్‌కు హాజరై, తర్వాత కాశ్మీర్ వెళ్లింది – దీనికెదురుగా ఏదైనా లింక్ ఉండవచ్చు" అని అతడు తన పోస్ట్ లో అనుమానం వ్యక్తం చేశాడు.
telugu-news | latest-news | cinema-news | youtuber jyoti malhotra | JYOTHI MALHOTRA | india-pakistan war tension | operation Sindoor espionage