/rtv/media/media_files/2025/05/18/P3NJTy9mfrENTcArfAzG.jpg)
fire maharastra Photograph: (fire maharastra)
Fire accident: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోలాపూర్‌లోని టెక్స్‌టైల్ మిల్లులో భారీగా మంటలు చెలరేగడంతో యజమాని సహా 8 మంది మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇద్దరు చిన్నారులతో యజమాని..
ఈ మేరకు ఆదివారం 3.45గంటల సమయంలో సోలాపూర్ ఎంఐడీసీలోని అక్కల్‌కోట్ రోడ్డులో ఉన్న సెంట్రల్ టెక్స్‌టైల్ మిల్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సహా కూడా ఉన్నట్లు తెలిపారు. మిల్లు యజమాని హాజీ ఉస్మాన్ హసన్‌భాయ్ మన్సూరీ, ఆయన ఒకటిన్నరేళ్ల మనవడు, ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, నలుగురు కార్మికులు చనిపోయినట్లు చెప్పారు. భారీగా మంటలను అదుపు చేసేందుకు 6 గంటలు కష్టపడ్డట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.
Also Read: రాకెట్ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?
మరోవైపు.. హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. 17 మంది చనిపోవడానికి కారణం ఇంటి యజమాని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అన్నారు. మొదట ఏసీ పేలడంతో ప్రమాదం జరిగిందని అంచనా వేసినా.. తర్వాత షార్ట్ సర్యూట్ కారణమని తెలిపారు. ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం, చెక్క ప్యానెళ్లు ఉండటం వల్లే ఈ ఘోరం జరిగిందని చెప్పారు.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి