Chhattisgarh: డ్యామ్ కూలి నలుగురు మృతి.. ముగ్గురు గల్లంతు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లుటి జలాశయం కూలిపోవడంతో, వరదనీరు సమీపంలోని గ్రామాల్లోకి ఉప్పెనలా దూసుకువచ్చింది. ఈ విషాద ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.