/rtv/media/media_files/2025/04/19/sfyygwaHfXphFLJkLO4F.jpg)
The Family Man Season 3
The Family Man Season 3: మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడవ సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండవ సీజన్ భారీ హిట్టై, చివరికి మళ్లీ కొత్త మిషన్‌కు శ్రీకాంత్ తివారీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం, సీజన్ 3 షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే, IPL 2025 తర్వాత అంటే మే 2025లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని టాక్ జోరుగా వినిపిస్తోంది.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
కొత్త క్యారెక్టర్‌తో ఊహించని ట్విస్ట్స్..
ఇంకా మేకర్స్ సీజన్ 3 కథను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈసారి కథలో సర్‌ప్రైజింగ్ ట్విస్ట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాక, ఈ సీజన్‌లో ప్రముఖ నటుడు జయదీప్ అహ్లావత్ చేరడంతో కథ మరింత రసవత్తరంగా మారనుంది.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
తారాగణం:
- మనోజ్ బాజ్‌పేయి
- ప్రియమణి
- షారిబ్ హష్మీ
- అశ్లేష ఠాకూర్
- వేదాంత్ సిన్హా
- దలీప్ తాహిల్
‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనేది ఓ మధ్యతరగతి వ్యక్తి - తను గూఢచారి అన్న విషయం తన కుటుంబానికి తెలియకుండా, దేశ రక్షణ కోసం పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ చుట్టూ తిరిగే కథ. ఇది NIAకి కల్పితంగా రూపొందించిన TASC విభాగాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించబడింది.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
ఈ వెబ్ సిరీస్‌కి రాజ్ & డీకే దర్శకత్వం వహించగా, మొదటి సీజన్ సెప్టెంబర్ 20, 2019న, రెండో సీజన్ జూన్ 4, 2021న విడుదలై రెండు సీజన్లూ ఘన విజయాన్ని సాధించాయి.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మూడో సీజన్ ఎప్పుడు?
మే 2024లో షూటింగ్ మొదలైన ఈ మూడవ సీజన్, మే 2025లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, అధికారిక రిలీజ్ తేదీపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.