Cyber Crime: సంచలన సైబర్ స్కామ్.. 3 గంటల్లో రూ.49 కోట్లు స్వాహా
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు రచిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా లోన్లు ఇచ్చే ఓ యాప్‌కే బురిడి కొట్టించారు. కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లు కాజేశారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు రచిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా లోన్లు ఇచ్చే ఓ యాప్‌కే బురిడి కొట్టించారు. కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లు కాజేశారు.
సైబర్ నేరగాళ్లు మరో కొత్త రూట్‌ను వెతుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు రూ.46,715 సాయం పొందవచ్చని.. దీనికోసం లింక్‌పై క్లిక్ చేయాలని వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపిస్తున్నారు. అప్రమత్తమైన కేంద్రం ఇది ఫేక్ అని స్పష్టం చేసింది.
దేశంలో విద్యార్థులందరికీ కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెబుతూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఎక్స్‌లో స్పష్టం చేసింది.
భూపేంద్రసింగ్ అనే వ్యక్తి సైబర్ స్కామర్‌నే బురిడీ కొట్టించి రూ.10వేలు ట్రాన్సఫర్ చేయించుకున్న ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. సీబీఐ ఆఫీసర్‌నంటూ కేటుగాడు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తాను బంగారం విడిపించాలని చెప్పి భూపేంద్ర తిరిగి రూ.10వేలు రాబట్టాడు.
ప్రభుత్వ స్కీమ్‌లు అందిస్తామంటూ గర్భిణులు, బాలింతల నుంచి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సభ్యులముఠా గుట్టు రట్టయింది. బాపట్ల జిల్లా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు ఏపీ, ఒకరు ఢిల్లీ వాసిగా గుర్తించారు. వీరు చాలా డబ్బులు కొట్టేశారని తెలిపారు.
డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు మేనేజర్ సహా 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వారి నుంచి చెక్‌బుక్‌లు, సెల్ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మల్టీలెవల్ మార్కెంట్ మాయలో పడొద్దని తెలంగాణ పోలీసులు ప్రజలకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రోడక్ట్స్ కొంటే చాలు లాభాలు వస్తాయని బ్రెయిన్ వాష్ చేసేవారితో జాగ్రత్త అని సూచించారు.
హైదరాబాద్‌లోని యాప్రాల్‌కు చెందిన 49 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. షేర్ ట్రేడింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.4.31 కోట్లు ట్రాన్సఫర్ చేశాడు. అనంతరం సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
సైబర్ స్కామర్లు కొత్త మోసానికి తెరతీశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సిమ్‌స్వాప్ చేసి రూ.7.5 కోట్లు కొట్టేశారు. అది గమనించిన ఆ వ్యాపారి పోలీసులను సంప్రదించారు. వెంటనే సైబర్ పోలీస్టీమ్ రూ.4.65 కోట్లను ఫ్రీజ్ చేసి నేరగాళ్లకు చిక్కకుండా ఆపగలిగింది.