HYD Rain Alert: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది.  పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, చార్మినార్, ఎల్బీనగర్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలు చోట్ల రోడ్లన్నీ జలమయమైపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

New Update

Rain Alert:  ఈరోజు  మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. మరో 3 గంటల పాటు ఈ వర్షం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, చార్మినార్, ఎల్బీనగర్‌ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. 

రోడ్లన్నీ జలమయయం 

భారీ వర్షం కురవడంతో పలు చోట్ల  రోడ్లన్నీ జలమయమైపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా ఫోర్స్  రోడ్లపై నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. 

తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడడంతో..  DRF బృందం నిలిచిపోయిన నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. 

ఉప్పల్ లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌ , మాదాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా మ్యాన్ హొల్స్ తెరుచుకొని డ్రైనేజ్ నీరు రోడ్లపై పారుతున్నాయి. మోకాలి లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. 

Also Read: Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు