Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

కమల్‌ హాసన్‌కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు.

New Update
What's wrong with what Kamal Haasan said, DMK MLA backs actor amid Kannada row

What's wrong with what Kamal Haasan said, DMK MLA backs actor amid Kannada row

ఇటీవల ప్రముఖ తమిళ నటుడు కమల హాసన్.. తమిళ్ నుంచే కన్నడ భాష పుట్టిందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయనపై కన్నడ వాసులు తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే తాజాగా కమల్‌ హాసన్‌కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు. కమల్ హాసన్‌ చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు. 

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!


ఇదిలాఉండగా ఇటీవల కమల హాసన్‌ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ కన్నడ వాసులు డిమాండ్ చేశారు. చివరికీ ఈ అంశం కర్ణాటక హైకోర్టు వరకు వెళ్లింది. అయినప్పటికీ కూడా కమల్ హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పేందుకు తిరస్కరించారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. ప్రేమ ఎప్పటికీ క్షమాపణలు చెప్పదంటూ స్పష్టం చేశారు. 

Also Read: ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

మరోవైపు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై కూడా కమల్‌ హాసన్‌ను విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం ఆయన భాషాపరమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. '' కమల్ హాసన్ విశ్వరూపం సినిమా తీశారు. మతంపై వివాదం తలెత్తినప్పుడు.. ఆ వివాదం నిజమైతే తాను 2013లో దేశం విడిచి వెళ్లిపోతానని చెప్పారు. కానీ ఈరోజు తన సొంత ప్రయోజనాల కోసం దేశ ఐక్యతకు వ్యతిరేకంగా నటిస్తున్నారు. మీకు సినిమాల నుంచి డబ్బులు కావాలంటే తెలుగు, కన్నడ, మళయళం కావాలి. కానీ ఓ ఫేక్ రాజకీయ నేతగా మీరు భాషా రాజకీయాలు చేస్తున్నారు. తమిళ్ భాషను ప్రేమించే మాలాంటి వాళ్లు మిమ్మల్ని దేశ ఐక్యతను నాశనం చేయొద్దని కోరుకుంటున్నారని'' సౌందరరాజన్ పేర్కొన్నారు.  

Also Read: ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు..మండుతుందిక్కడ

Advertisment
Advertisment
తాజా కథనాలు