/rtv/media/media_files/2025/06/05/1A8hMxEnLvsqBa8RhLYK.jpg)
Probe underway at Odisha govt hospital after families claim 5 patients died of ‘wrong injection’
ఒడిశాలో ని కొరాపుట్ జిల్లాలో విషాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో సూదిమందు వికటించి ఐదుగురు రోగులు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సిమిలిగూడ, కొరాపుట్, కలహండి, బొరిగుమ్మ ప్రాంతాలకు చెందిన సుక్రమాఝి(45), పులోమతి మాఝి(40), భగవాన్ పారిజ(55), బటి ఖొరా (45), రుక్మిణి పెల్టియా(40), అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరారు. కొరాపుట్‌లోని సహీద్ లక్ష్మణ్ నాయక్ ఆస్పత్రిలో వీళ్లు చికిత్స తీసుకుంటున్నారు.
Also Read: బెంగళూరు తొక్కిసలాట ఏ సమయంలో జరిగిందంటే..
మంగళవారం వీళ్లకు శస్త్రచికిత్సలు జరిగగా.. ఆ తర్వాత అత్యవసర వార్డుకు తరలించారు. రాత్రి 11 గంటలకు ఓ నర్సు వీళ్లకు రెండు డోసుల ఇంజెక్షన్‌లు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఐదుగురు మృతి చెందారు. అయితే వీళ్లందరికీ తప్పుడు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే ప్రాణాలు కోల్పోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Also Read: ఇంత జనం వస్తారని ఊహించలేదు : సీఎం సిద్ధరామయ్య
దీనిపై కలెక్టర్ కీర్తివాసన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రోగులకు సరైన మందులే ఇచ్చామని వైద్య కళాశాల డీన్ సుశాంత్ అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత విషయం తెలుస్తుందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సీఎల్పీ నేత, పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్ర మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
Also Read: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!