Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

బెంగళూరు లో ఒకవైపు తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతుంటే కొంతమంది దుర్మార్గులు అమ్మాయిల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఘటనను అవకాశంగా తీసుకున్న కామంధులు అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ  ఓ వ్యక్తి  విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.

New Update
Bengaluru Stampede

Bengaluru Stampede

 Bengaluru Stampede:  ఐపీఎల్‌ లో విజయం సాధించిన రాయల్‌ ఛాలెంజర్లు బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ సభలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించతలపెట్టిన విజయోత్సవ సభలో  తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది వరకు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా అభిమానుల మృతి, గాయాలతో ఆ ప్రాంతమంతా శోకంతో నిండిపోయింది. దీంతో విజయోత్సవ సభ విషాద సభగా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగానే ఒకవైపు తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతుంటే కొంతమంది దుర్మార్గులు అమ్మాయిల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఘటనను అవకాశంగా తీసుకున్న కామంధులు అమ్మాయిలను వేధించారు.

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

తొక్కిసలాట సమయంలో  కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ  ఓ వ్యక్తి  విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ‘నేను నా స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడాను. నా ఫ్రెండ్ కజిన్ ఒకరు ఆర్సీబీ విజయోత్సవం కోసం చిన్నస్వామి స్టేడియంకు వెళ్లింది. తొక్కిసలాట సమయంలో ఆమెను కొందరు అబ్బాయిలు లైంగికంగా వేధించారు. ఆమె బట్టలు కూడా చించారు.

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

ఇదే ఛాన్స్ అని ఎక్కడబడితే అక్కడ తాకుతూ దారుణంగా ప్రవర్తించారు. పరిస్థితులను ఉపయోగించుకుని అత్యాచారం చేయడానికి యత్నించారు. ఇది చాలా దారుణం. చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు’ అని ఆయన వీడియోలో పేర్కొన్నాడు. కాగా ఈ వీడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు శవాలతోనూ రొమాన్స్‌ చేస్తారని విమర్శిస్తున్నారు. ఇలాంటివారిని ఉరితీసిన పాపం లేదని ఈసడించుకుంటున్నారు.

Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు