Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్‌ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్‌ వాడిట్టివార్‌ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్‌లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.

New Update
We used Rs 15 lakh missiles to shoot down Pak’s Rs 15,000 Chinese drones, Congress leader demands clarification

We used Rs 15 lakh missiles to shoot down Pak’s Rs 15,000 Chinese drones, Congress leader Vijay Wadettiwar demands clarification

Vijay Wadettiwar Controversy: పహల్గాం ఉగ్రదాడికి(Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్(India Operation Sindoor) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్‌  డ్రోన్లు(Pakistan Drones), క్షిపణులను(Missiles) భారత్‌పై ప్రయోగించనగా మన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌(India Air Defense Systems) వాటిని కూల్చేశాయి. అయితే దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేత(Congres Leader) విజయ్‌ వాడిట్టివార్‌ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ప్రయోగించిన చైనీస్ డ్రోన్‌లను కూల్చేందుకు ఖరీదైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు. 

Also Read: USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం

Also Read: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

'' భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల సమయంలో చైనా తయారుచేసిన 5 వేల డ్రోన్లను భారత్‌పైకి పాక్ ప్రయోగించింది. ఆ డ్రోన్ల ధరలు ఒక్కొక్కటి రూ.15 వేలు మాత్రమే. కానీ వాటిని నేలకూల్చేందుకు కేంద్రం రూ.15 లక్షల విలువైన క్షిపణులను ఎందుకు వినియోగించింది. ఆపరేషన్ సిందూర్‌లో మనకు జరిగిన నష్టం గురించి ప్రభుత్వం ప్రజలకు వివరించాలి. మనకు జరిగిన నష్టం గురించి ప్రభుత్వాన్ని అడగటం తప్పా అంటూ'' వాడెట్టివార్‌ వ్యాఖ్యానించారు. 

Also Read: భారత్‌లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం..

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇటీవల ఈ అంశంపై పలుమార్లు మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో తెలియజేయాలని విదేశాంగ శాఖను కోరారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించకూడదన్నారు. అలాగే ఈ ఆపరేషన్‌పై పాక్‌కు ముందే సమాచారం ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ విదేశాంగ శాఖ రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది. ఆపరేషన్‌కు ముందు ఉగ్రచర్యలపై పాకిస్థాన్‌ను హెచ్చరించామని ఆ తర్వాతే దాడులపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. 

Also Read: పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు.. ఎన్ఐఏతో కలసి ఐదు రోజుల పాటు...

telugu-news | rtv-news | Pahalgam attack | operation Sindoor | congress | Rahul Gandhi

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు