PM Modi - Amrit Bharat Stations: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

రాజస్థాన్‌లో ప్రధాని మోదీ 103 అమృత్‌ భారత్‌ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీనంగర్, అలాగే వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఏపీలో సూళ్లురుపేట అమృత్‌ భారత్‌ స్టేషన్‌ ఉంది.

New Update
PM Modi Inaugurates 103 Amrit Bharat Stations across nation

PM Modi Inaugurates 103 Amrit Bharat Stations across nation

PM Modi - Amrit Bharat Stations: రాజస్థాన్‌లో(Rajasthan) ప్రధాని మోదీ  103 అమృత్‌ భారత్‌ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్‌ పథకంలో భాగంగా మొత్తం 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా రూపొందించిన ఈ రైల్వే స్టేషన్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీనంగర్, అలాగే వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లురుపేట అమృత్‌ భారత్‌ స్టేషన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన సరదాగా ముచ్చటించారు. 

Also Read: భారీ ఎన్‌ కౌంటర్‌..ఐదుగురు మావోలు మృతి

ఇక వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో ఒకరోజు పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడ రూ.26 వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు ప్రారంభించారు. ముందుగా ప్రధాని భారత వైమానిక దళానికి చెందిన నల్‌ ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ దేశ్‌నోక్‌లోని కర్ణి మాతా ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత 18 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 103 అమృత్‌ స్టేషన్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. 

Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

రూ.4,850 కోట్ల విలువైన జాతీయ రహదారి..

ఆ తర్వాత బికనీర్‌ ముంబై ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. చురుసాదుల్‌పూర్‌ రైలు మార్గానికి కూడా పునాది రాయి వేశారు. అలాగే సరిహద్దు కనెక్టివిటీని పెంచేందుకు అనువైన రూ.4,850 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగించిన మోదీ పహల్గాం ఉగ్రదాడిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. '' 22 నిమిషాల్లో ఉగ్రవాదులు పహల్గాంలో నరమేధం సృష్టించారు. వాళ్లను మనం 23 నిమిషాల్లోనే అంతం చేశాం. ఉగ్రవాదులు సిందూరం తుడుస్తే మనం వాళ్లని మట్టిలో కలిపేశాం. ఆపరేషన్‌ సిందూర్‌తో వాళ్ల అంతు చూశాం. దేశాన్ని తలదించుకోనివ్వను. త్రివిధ దళాలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది ప్రధాని మోదీ అన్నారు.  

Also Read: భారత్‌లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం..

 

 telugu-news | rtv-news | rajastan

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు