/rtv/media/media_files/2025/01/28/mChg9JdVa25AtSwDPkCX.jpg)
Indian Fishermen
Srilanka Navy: భారత్‌కు చెందిన మత్స్యకారులపై మంగళవారం ఉదయం శ్రీలంక నేవీ కాల్పులు జరిపింది.ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్లు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీలంక రాయబార కార్యాలయానికి భారత్ సమన్లు జారీ చేసింది. శ్రీలంక రాజధాని కొలంబోలో కూడా భారత హైకమిషన్ ఈ అంశాన్ని శ్రీలంక విదేశాంగ శాఖ ముందు లేవనెత్తింది.
Also Read: కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్.. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు!
ఇక వివరాల్లోకి వెళ్తే..
శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ దీవికి సమీపంలో భారత్‌కు చెందిన 13 మంది జాలర్లను అక్కడి నేవీ అడ్డుకుంది. వీళ్లు తమిళనాడు, పుదుచ్చేరికి చెందినవాళ్లు. అయితే వీళ్లని అడ్డుకొని అరెస్టు చేస్తుండగా కొందరు తప్పించుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే వాళ్లపై శ్రీలంక నేవీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీళ్లని ఆస్పత్రికి తరలించారు.
Also Read: వాళ్లకి రుణమాఫీ చేయొద్దు.. కేజ్రీవాల్ సంచలన డిమాండ్
మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వీరితో పాటు మిగతావాళ్లందరినీ శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఢిల్లీలో శ్రీలంక రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు పంపించింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా బలప్రయోగం చేయడం ఏమాత్రం మంచిదికాదని తేల్చిచెప్పింది. ఈ అంశంలో ఇరు దేశాల మధ్య ఉన్న అవగాహన ఒప్పందాలను పాటించాలని సూచనలు చేసింది.
Also Read: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్
Also Read: యూపీలో పెను విషాదం.. లడ్డూల కోసం ఫైట్.. ఏడుగురి మృతి.. 60 మందికి సీరియస్