/rtv/media/media_files/2025/07/15/student-suicide-2025-07-15-16-22-24.jpg)
Odisha student suicide
ఒడిసాలో ఘోరం జరిగింది. కాలేజీలో తనపై ప్రొఫెసర్ పాల్పడుతున్న లైంగిక వేధింపులను భరించలేక.. యాజమాన్యానికి, ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదన్న మనోవేదనతో 22 ఏళ్ల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మహత్యాయత్నం చేసింది. కాలేజీ కారిడార్‌లోనే ఒంటికి నిప్పంటించుకుంది. 95శాతం మేర గాయాలతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమెను మంటల్లోంచి కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి 70శాతం మేర గాయాలయ్యాయి. బాలాసోర్‌లోని ఫకిర్ మోహన్ అటానమస్ కాలేజీలో ఈ ఘోరం జరిగింది.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
Sexual Harassment In Odisha College
సౌమ్యశ్రీ ఆ కాలేజీలో బీఈడీ సెకండియర్ చదువుతోంది. విభాగాధిపతి సమీర్ కుమార్ కొన్నినెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని... అకడమిక్ కెరీర్‌ను నాశనం చేసి, భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని జూలై 1న ఆమె కాలేజీ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి 10రోజులైనా యాజమాన్యం స్పందించడం లేదని, పైగా కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు సోమవారం కాలేజీ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ క్రమంలోనే ఒంటికి నిప్పంటించుకొంది.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
జూన్ 12నఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సౌమ్యశ్రీ ఆసుపత్రికి తరలించగా సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయింది. కాగా ఈ ఘటనతో కాలేజీ HOD సమీర్‌కుమార్ ను అరెస్ట్ చేయడంతో పాటు, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు. కాగా సౌమ్యశ్రీ మృతిపై సీఎం మోహన్ చరణ్ మాంఝి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులందరికీ కఠిన శిక్ష పడుతుందని సీఎం హామీ ఇచ్చారు.
లెక్చరర్ వేధింపులు భరించలేక కాలేజీ ప్రాంగణంలో నిప్పంటించుకొన్న సౌమ్య శ్రీ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థీకృత హత్య అని బీజేపీ పై మండిపడ్డారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్ మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Also Read : భట్టికి బిగ్ షాక్..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్ నోటీసులు
‘ఒడిశాలో న్యాయం కోసం బాధిత విద్యార్థిని ధైర్యంగా, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన గొంతుక వినిపించింది. అందుకు, ఆమెకు న్యాయం చేయడానికి బదులు.. బెదిరించి, హింసించారు. పదేపదే అవమానించారు. ఎప్పటిలాగే బీజేపీ వ్యవస్థ నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఒక అమాయకురాలైన విద్యార్థిని తనకు తాను నిప్పంటించుకునేలా చేసింది. ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థీకృత హత్య. మోదీ జీ ఒడిశా లేదా మణిపుర్‌లో అయినా.. దేశంలో కుమార్తెలు కాలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇంకా మౌనంగానే ఉంటారా?. దేశానికి మీ మౌనం అవసరం లేదు. వీటన్నింటికీ సమాధానాలు కావాలి. భారతదేశ మహిళలకు భద్రత, న్యాయం కావాలి’ అని రాహుల్‌ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
odisha-police | odisha-news | odisha-accident | crime news | student-suicide | Student Suicide News | odisha