Odisha : ఒడిశాలో దారుణం...అరగుండ్లు కొట్టించి.. మురుగు నీరు తాగించి!
ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు దళితులను ఘోరంగా హింసించారు. అనంతరం వారికి అరగుండు కొట్టించి మురుగునీరు తాగించి అమానుషంగా ప్రవర్తించిన తీరు ఒడిశాలో మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.