Maoist party : ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్‌ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఒక లేఖను విడుదల చేశారు.

New Update
Maoist party

Maoist party

Maoist party : దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో జాతీయ భద్రతాదళాలు ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులను హతమార్చింది. అయితే మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్‌ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఒక లేఖను విడుదల చేశారు.

మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖా సారాంశం..


తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్‌ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని "మా నుండి 6నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామని ప్రకటించుచున్నాము'.


ప్రియమైన కామ్రెడ్స్‌, ప్రజలారా!


గత కొంతకాలంగా మా పార్టీకి ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరుపాలనే డిమాండ్‌ ను మొదట తెలుగు రాష్ర్టా్ల్లో ప్రారంభించారు. దానిలో భాగంగా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. దేశ వ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు, వ్యక్తులు, ప్రముఖులు, పార్టీలు ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ చర్చల విషయాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీపీఐ కగార్‌ ఆపరేషన్‌ ను రద్దు చేసి శాంతి చర్చలు జరుపాలని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తుంది. ఈ కార్యక్రమాలలో మిగతా వామపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా తమ రజతోత్సవ సభలో శాంతి చర్చలు జరుపాలని తీర్మానం చేసింది.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా శాంతి చర్చలు జరుపాలనే డిమాండ్‌ ను చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రశేఖర్‌ రావు కూడా ఇదే డిమాండ్‌ ను ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత కూడా ఇదే డిమాండ్‌ ను చేశారు. ఇది హర్షించదగిన విషయం.

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!


రాష్ట్రంలో ఇంకా అనేక మంది మేధావులు, ప్రముఖులు ఇదే విషయం మీద ప్రచారం చేస్తున్నారు. అన్ని వామపక్ష పార్టీలు ఇదే డిమాండ్‌ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలో, దేశంలోనూ ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకువచ్చే ప్రయత్నంగా అర్ధం చేసుకోవాలి. ఈ ప్రయత్నాలకు సానకూలతను కలిగించేందుకు మా నుండి కాల్పుల విమరణను ప్రకటించుచున్నాము.


జగన్‌
అధికార ప్రతినిధి

Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్


Advertisment
తాజా కథనాలు